E-Paper
Advertisement

Fyamily Drama OTT : కుక్క మిస్సింగ్ తో ఆసక్తికరంగా సాగే స్టోరీ… పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా

Fyamily Drama OTT : కుక్క మిస్సింగ్ తో ఆసక్తికరంగా సాగే స్టోరీ… పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా
Advertisement

Fyamily Drama OTT : ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల తల్లిదండ్రులు పిల్లలకు దూరం కావడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ఇది పిల్లలపై చాలా ప్రభావం చూపించే విషయం అని చాలా మంది మరచిపోతున్నారు. ఈ నేపథ్యంలో హార్ట్‌ ను టచ్ చేసే ఒక మూవీ వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి, ముఖ్యంగా పిల్లలతో చూడదగ్గ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. పెంపుడు కుక్క చుట్టూ తిరిగే ఈ స్టోరీలో మూగజీవాల పట్ల పిల్లలకు ఉండే నిస్వార్థమైన ప్రేమను దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2023లో వచ్చిన ఈ తమిళ చిల్డ్రన్స్ ఫ్యామిలీ అడ్వెంచర్ సినిమా పేరు ‘షాట్ బూట్ త్రీ’ (Shot Boot Three). ఇది అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాను కూడా ఆయనే నిర్మించారు. ఈ చిత్రంలో స్నేహ, వెంకట్ ప్రభుతో పాటు యోగి బాబు, శివాంగి కృష్ణకుమార్, పూవైయార్, ప్రణితి, కైలాష్ హీత్, వేదాంత్ వసంత్ సహాయక పాత్రల్లో నటించారు. సంగీతం రాజేష్ వైద్య అందించారు. Amazon Prime Video, aha ఓటీటీలలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  సునామీలో చిక్కుకుని ఐలాండ్ లో… 90 రోజుల్లో మతిపోగొట్టే పనులు

స్టోరీ ఏమిటంటే

కైలాష్ అనే అబ్బాయి ఒక రిచ్ ఫ్యామిలి కిడ్. అతని తల్లిదండ్రులు (స్నేహ, వెంకట్ ప్రభు) తమ ఉద్యోగాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ, కొడుకుతో గడపడానికి సమయం కేటాయించలేరు. కైలాష్‌తో పాటు పల్లవి, బాలు, రమణ అనే ముగ్గురు స్నేహితులు ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటారు. అయితే కైలాష్‌కు ‘మాక్స్’ అనే గోల్డెన్ రిట్రీవర్ కుక్క అంటే ప్రాణం. తన ఒంటరితనంలో మాక్సే అతనికి ప్రాణస్నేహితుడు. కేవలం కైలాష్‌కే కాకుండా, ఆ నలుగురు పిల్లలకు మాక్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు మాక్స్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. మాక్స్ ఎక్కడో తప్పిపోయిందని పిల్లలు ఆందోళన చెందుతారు. కైలాష్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పినా, వారు దానిని అంత సీరియస్‌గా తీసుకోరు.

Advertisement

ఇక మాక్స్‌ను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ నలుగురు పిల్లలు నిర్ణయించుకుంటారు. పెద్దల సహాయం లేకుండానే చెన్నై నగర వీధుల్లోకి వెతుకులాట మొదలెడతారు. ఈ ప్రయాణంలో వారికి తల కుమార్ (యోగి బాబు) అనే వ్యక్తి పరిచయమవుతాడు. మొదట అనుమానాస్పదంగా అనిపించినా, తర్వాత అతను పిల్లలకు సహాయం చేస్తాడు. చివరికి పిల్లలు మాక్స్‌ను ఎలా కనుగొన్నారు? ఈ ప్రయాణంలో వీళ్ళు నేర్చుకున్న జీవిత పాఠాలేమిటి? కొడుకు ఎమోషన్స్ ని తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకున్నారు? అనే అంశాలతో సినిమా ముగుస్తుంది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×