E-Paper
Advertisement

Amazon Flipkart Fine: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై ప్రభుత్వం సీరియస్.. ఆ వస్తువు విక్రయించినందుకు భారీ జరిమానా

Amazon Flipkart Fine: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై ప్రభుత్వం సీరియస్.. ఆ వస్తువు విక్రయించినందుకు భారీ జరిమానా
Advertisement

Amazon Flipkart Fine| ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైంది. ఒక క్లిక్‌తో బట్టలు, గాడ్జెట్లతో పాటు నిత్యాసరాలు కూడా కొనుగోలు చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి పెద్ద ఈ-కామర్స్ సైట్లపై ప్రజలు ఎంతో నమ్మకంగా కొనుగోలు చేస్తారు. కానీ ఇటీవల ఈ రెండు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ దేశ భద్రతను ప్రమాదంలో పడేశాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లపై అక్రమ వాకీ-టాకీల విక్రయం జరిగింది. ఇది కేవలం వినియోగదారుల హక్కుల సమస్య కాదు. దేశ భద్రతకు కూడా ముప్పు తెచ్చింది.

కేసు ఎలా బయటపడింది?

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) స్వయంగా దర్యాప్తు ప్రారంభించింది. వివిధ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఉన్న లిస్టింగ్‌లను పరిశీలించింది. అక్కడ భారీ సంఖ్యలో అక్రమ రేడియో పరికరాలు కనిపించాయి. వీటిలో వాకీ-టాకీలు, పర్సనల్ మొబైల్ రేడియోలు ఉన్నాయి. సుమారు 16,970 అక్రమ ఉత్పత్తుల లిస్టింగ్‌లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించాయి. చాలా పరికరాలకు లైసెన్స్ లేదు. అవసరమైన ఆమోదం కూడా లేదు.

భారీ జరిమానా విధించిన ప్రభుత్వం

Advertisement

CCPA మొత్తం ఎనిమిది కంపెనీలపై చర్యలు తీసుకుంది. మొత్తం రూ.44 లక్షల జరిమానా వేశారు. అమెజాన్‌కు రూ.10 లక్షలు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.10 లక్షలు జరిమానా విధించగా.. మీషోకు కూడా రూ.10 లక్షలు, మెటా (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్)కు రూ.10 లక్షలు వేశారు. జియోమార్ట్, చిమియా, టాక్ ప్రో, మాస్క్‌మన్ టాయ్స్‌పై రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించారు. కొన్ని కంపెనీలు జరిమానా చెల్లించాయి. మిగిలినవి చెల్లించాల్సి ఉంది.

వినియోగదారులకు మోసం

కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా లిస్టింగ్‌లలో ఉత్పత్తులు 100% చట్టబద్ధమైనవి, లైసెన్స్ ఫ్రీ అని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించింది. ఇలాంటి మోసాలు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

భారత చట్టంలో ఏముంది?

Advertisement

భారతదేశంలో కొన్ని వాకీ-టాకీలు మాత్రమే లైసెన్స్ లేకుండా ఉపయోగించవచ్చు. అవి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో మాత్రమే పనిచేయాలి. ప్రతి పరికరానికి ఈక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) సర్టిఫికేషన్ అవసరం. చాలా లిస్ట్ చేసిన పరికరాలు ఈ నిబంధనలకు అనుగుణంగా లేవు. నిషేధిత ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తున్నాయి.

మధ్యవర్తి అనే వాదన తిరస్కరించన ప్రభుత్వం

కొన్ని ప్లాట్‌ఫామ్‌లు తాము కేవలం మధ్యవర్తులమని, మూడవ పక్ష విక్రేతలే అసలు బాధ్యులని చెప్పాయి. కానీ CCPA ఈ వాదనను తిరస్కరించింది. పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఉత్పత్తులను తనిఖీ చేయాలి. అక్రమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే వారు కూడా బాధ్యత వహించాల్సిందేనని తీర్మానించింది.

సీరియస్ అంశం

అక్రమ రేడియో పరికరాలు ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌లను భంగపరుస్తాయి. పోలీసు, విపత్తు నివారణ వ్యవస్థలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ప్రజల భద్రతకు, దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తుంది.

Also Read: ఒటిపి, పిన్ ఏదీ అవసరం లేదు.. కేవలం ఫింగర్‌ప్రింట్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

కొత్త నియమాలు

ప్రభుత్వం రేడియో ఈక్విప్‌మెంట్ సేల్ రూల్స్ 2025 విడుదల చేసింది. ఇకపై ఈ-కామర్స్ సైట్లు ఉత్పత్తులను లిస్ట్ చేసే ముందు సర్టిఫికేషన్ తనిఖీ చేయాలి. పారదర్శక సమాచారం ఇవ్వాలి. ఇలాంటి ఉల్లంఘనలకు ఇంకా కఠిన శిక్షలు వస్తాయి.

ఆన్‌లైన్ కొనుగోలుదారులకు హెచ్చరిక

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చౌక ధరలు చూసి కొనకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనేటప్పుడు సర్టిఫికేషన్ వివరాలు తప్పక చెక్ చేయాలి.

Related News

ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. అన్‌లిమిటెడ్ 5G డేటాపై ఆంక్షలు, హాట్‌స్పాట్ వాడితే అంతే సంగతులు!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×