E-Paper
Advertisement

Comedy Survival Drama OTT : సునామీలో చిక్కుకుని ఐలాండ్ లో… 90 రోజుల్లో మతిపోగొట్టే పనులు

Comedy Survival Drama OTT : సునామీలో చిక్కుకుని ఐలాండ్ లో… 90 రోజుల్లో మతిపోగొట్టే పనులు
Advertisement

Comedy Survival Drama OTT : కామెడీతో తెరకెక్కే కొన్ని సినిమాలను చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలాంటి సినిమాలు చూస్తే మైండ్ కూడా రీఫ్రెష్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ చైనీస్ ఫాంటసీ మూవీలో ఒక సునామీ వచ్చి కొంతమంది దీవిలో చిక్కుకుపోతారు. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ అందరూ ఎంచక్కా చూడవచ్చు. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2018లో వచ్చిన ఈ చైనీస్ ఫాంటసీ కామెడీ మూవీ పేరు ‘ది ఐలాండ్’ (The island). ప్రముఖ నటుడు హువాంగ్ బో దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో హువాంగ్, షు క్వి, వాంగ్ బావోకియాంగ్, లే జాంగ్, యు హెవీ, వాంగ్ జున్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2018 ఆగస్టు 10న చైనాలో రిలీజ్ అయింది. ఐయండిబిలో 6.2/10 రేటింగ్ తో netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

స్టోరీ ఏమిటంటే

జిన్ అనే ఒక సామాన్య వ్యక్తి అప్పుల్లో ఉంటాడు. ఎలాగైనా లాటరీ గెలిచి ధనవంతుడు కావాలని కలలు కంటుంటాడు. అయితే ఒక రోజు అతను పనిచేసే కంపెనీ తన ఉద్యోగులందరినీ ఒక ట్రిప్ కోసం సముద్ర ప్రయాణానికి తీసుకెళ్తుంది. ఆ ప్రయాణంలో ఉండగానే, మా జిన్‌కు తాను 60 మిలియన్ల భారీ లాటరీ గెలుచుకున్నట్లు మెసేజ్ వస్తుంది. అతను ఆ ఆనందంలో ఉండగానే, ఒక భారీ సునామీ వచ్చి వాళ్ళ నౌకను ముంచేస్తుంది. ఉద్యోగులందరూ ఒక నిర్మానుష్య ద్వీపానికి కొట్టుకుపోతారు. బయటి ప్రపంచం మొత్తం అంతమైపోయిందని, తాము మాత్రమే బతికామని వాళ్ళు నమ్ముతారు. అక్కడ మనుగడ సాగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీన్స్ చాలా కామెడీతో ఉంటాయి.

Advertisement

అయితే కొన్ని రోజుల తర్వాత జిన్ ఒక ఓడ ద్వీపం పక్క నుండి వెళ్లడాన్ని గమనిస్తాడు. అంటే బయటి ప్రపంచం సురక్షితంగా ఉందని అతనికి అర్థమవుతుంది. కానీ జిన్ తన లాటరీ టికెట్ గడువు ముగిసిపోయిందని, బయటి ప్రపంచానికి వెళ్తే తను మళ్ళీ పేదవాడిగానే మిగిలిపోతానని భయపడతాడు. ఇక్కడ తనకు లభించిన గౌరవం పోకూడదని నిజాన్ని దాచిపెట్టాలని చూస్తాడు. చివరికి వీళ్ళు బయట ప్రపంచం చూస్తారా ? ఆ దీవిలో ఉండిపోతారా ? అనే విషయాలను ఈ చైనీస్ ఫాంటసీ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×