E-Paper
Advertisement

OTT Movie: కేరళ స్టేట్ అవార్డ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఇక్కడే

OTT Movie: కేరళ స్టేట్ అవార్డ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఇక్కడే
Advertisement

OTT Movie : థియేటర్లలో విడుదలైన ‘ఫెమినిచి ఫాతిమా’ మలయాళ చిత్రం త్వరలో డిజిటల్‌ స్ట్రీమింగ్ లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఒటీటీ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 55వ కేరళ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (శ్యామలా హంజా), ఉత్తమ దర్శకుడు (ఫాసిల్ ముహమ్మద్) తో పాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇక అందరికీ అందుబాటులోకి రానుంది. ఒక పరుపు చుట్టూ తిరిగే ఈ కథ ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సంఘటనలను సున్నితంగా చూపిస్తుంది. ఈ సినిమా ఏ ఓటిటిలోకి రానుంది ? దీని వివరాలు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఫాసిల్ ముహమ్మద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫెమినిచి ఫాతిమా’ సినిమాలో ప్రధాన పాత్రలో ఫాతిమా పాత్రను షమ్లా హంజా నటించగా, కుమార్ సునీల్, విజి విశ్వనాథ్, ప్రసీత, రాజి ఆర్, బబితా బషీర్ సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో షమ్లా హంజా పాత్రకు, ఇటీవల 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా మనోరమ మాక్స్ లో వచ్చే నెల స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలోని పొన్నాని అనే చిన్న టౌన్‌లో ఫాతిమాకి, భర్త అష్రఫ్ తో పాటుముగ్గురు పిల్లలు కూడా ఉంటారు. భర్త మస్జిద్ లో పని చేస్తుంటాడు. ఫాతిమా రోజూ ఉదయం 5 గంటలకు లేచి, పిల్లల్ని స్కూల్‌కి సిద్ధం చేసి, భర్తకి టిఫిన్ పెట్టి, ఇల్లు శుభ్రం చేసి, సాయంత్రం పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి, రాత్రి వంట చేసి… ఇలా 24×7 రొటీన్ లైఫ్ లో ఉంటుంది. భర్త ఆమెకి బయటికి వెళ్లొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు, డబ్బు గురించి అడగొద్దు అంటూ కండిషన్లు పెడుతుంటాడు. ఫాతిమా ఇవన్నీ మౌనంగా భరిస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు పిల్లలు పడుకునే పరుపులో యూరిన్ పోసుకుంటారు. ఆ తరువాత ఒక కుక్క కూడా దాని మీద పని కానిస్తుంది. పరుపు కూడా బాగా పాడై ఉంటుంది.

Read Also : పెళ్ళైనోడిని ప్రేమించే సైకో అమ్మాయి… మత్తు ఇచ్చి మంచం మీద… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్

ఫాతిమా భర్తని కొత్త పరుపు కొనుక్కుందాం అని అడుగుతుంది. అష్రఫ్ అది వృథా ఖర్చు అని తేలిగ్గా తీసుకుంటాడు. ఫాతిమా మళ్లీ మళ్లీ అడిగినా అదే సమాధానం. ఇక ఫాతిమాకి ఒక్కసారిగా కోపం, బాధ, అసహనం కలిసి వస్తాయి. ఇక అక్కడి నుంచి ఫాతిమా చిన్న చిన్న తిరుగుబాటు పనులు మొదలెడుతుంది. పొరుగింటి మహిళలతో రహస్యంగా మాట్లాడుతుంది. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అమ్మి కొంచెం డబ్బు సేకరిస్తుంది. పొరుగింటి మహిళలు కూడా ఫాతిమాని సపోర్ట్ చేస్తారు. వాళ్లకి కూడా ఇంట్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. చివరికి అనేక ప్రయత్నాల మీద ఫాతిమా కొత్త పరుపును కొంటుంది. ఈ చిన్న ప్రయాణం ఆడియన్స్ కి ఒక పెద్ద ఎమోషన్ ఇస్తుంది.
Advertisement

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×