Friday OTT Releases : ప్రతి వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతివారం ఎలాగైతే థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తాయో అలాగే ఓటీటీ లలోకి కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు అవుతున్నాయి.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి సినిమాలతో పాటుగా వేరే భాషలలోని డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.. ఈ సినిమాలు ఈ వారం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మరి ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే దాదాపు 21 సినిమాలు రాబోతున్నాయి. మరి వీటిలో తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. వీటితోపాటుగా డబ్బింగ్ సినిమాలలు, హాలీవుడ్ సినిమాలు కూడా కొన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ మూవీ ఓటీటీలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి చూసేద్దాం…
మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17
ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17
లెగో – ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17
బెబెఫిన్‌సింగ్-ఎలాంగ్‌మూవీ ఇన్ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19
180(మూవీ)- ఏప్రిల్ 17
రూమ్‌మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17
ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17
పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17
ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17
గుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17
గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ఎక్కువగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లలో మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక వచ్చే నెల సమ్మర్ స్పెషల్గా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం పెద్ది మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..