E-Paper
Advertisement

భార్యలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ రొమాన్స్

భార్యలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ రొమాన్స్
Advertisement

Romantic Comedy OTT : కడుపుబ్బా నవ్వుకునే ఒక అచ్చమైన కామెడీ సినిమా చూడాలనుకుంటే, ఈ స్పానిష్ రొమాంటిక్ కామెడీ సినిమాపై ఓ లుక్ వేయండి. కథ చిన్నదైనా, గందరగోళం మధ్య పుట్టే కామెడీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక అడల్ట్ కామెడీ డ్రామా. భార్యాభర్తల మధ్య సాగే గందరగోళ పరిస్థితుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా కాదు, కేవలం పెద్దలకు మాత్రమే. ఈ కథలో పెళ్లి జరిగి 15 ఏళ్లు అయిన ఒక జంట, కొత్తదనం కోసం మరొక జంటతో గడపాలనుకుంటారు. ఆ తరువాత వచ్చే కామెడీ మామూలుగా అయితే ఉండదు.

ఎక్కడ చూడచ్చు అంటే

2017లో వచ్చిన ఈ స్పానిష్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు “ఎల్ ఇంటర్కాంబియో” (El Intercambio). ఇగ్నాసియో నాచో దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో పెపోన్ నీటో, నటాలియా రోయిగ్, రోస్సీ డి పల్మా, హ్యూగో సిల్వా లీడ్ రోల్స్ లో నటించారు. సినిమా ఒకే ఒక అపార్ట్‌మెంట్ గదిలో జరుగుతుంది. సినిమా అంతా డైలాగుల మీద, నటీనటుల హావభావాల మీద నడుస్తుంది. ముఖ్యంగా ‘డొమినా’ పాత్ర వేసిన రోస్సీ డి పల్మా తన వింతైన నటనతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. స్పానిష్ సినిమాల్లో ఇలాంటి ప్రయోగాత్మక కామెడీలు అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇది అందులో ఒకటి. ఇక కంటెంట్ విషయానికి వస్తే, ఇందులో అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది పెద్దలకు మాత్రమే. గూగుల్ ప్లే మూవీస్, ఆపిల్ టీవీ ప్లాట్‌ ఫామ్‌లలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

జైమ్, ఇవా అని ఒక మొగుడు పెళ్ళాం ఉంటారు. పెళ్ళయ్యి పదిహేనేళ్లు అయిపోయేసరికి జైమ్‌కి లైఫ్ బోర్ కొట్టేస్తుంది. పెళ్ళాం మీద మునుపటి లాగా క్రేజ్ లేదని, ఏదైనా వెరైటీగా చేద్దామని ఒక ఐడియా వేస్తాడు. అదేంటంటే మనం ఇద్దరం వేరే వాళ్ళతో వెళ్దాం, వాళ్ళని మనం మార్చుకుందాం అని పెళ్ళాం ఇవాని ఒప్పిస్తాడు. ఇప్పుడు జైమ్ మనసులో ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటాడు. ఎవరో ఒక పాతికేళ్ల సూపర్ మోడల్ లాంటి పిల్లే వస్తుందని ఫుల్ ఖుషీ అయిపోతాడు. కానీ సీన్ కట్ చేస్తే, ఆ రోజు రాత్రి వీళ్ళ ఇంటికి వచ్చింది మాత్రం ఒక ముసలావిడ, ఆమెతో ఇంకా ఒక కుర్రాడు వస్తాడు. జైమ్ అస్సలు ఊహించని ఫిగర్లు ఎదురుగా ఉండేసరికి వాడి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నిజానికి జైమ్ టీనేజ్ అమ్మాయి వస్తుందని ఆశపడతాడు. అయితే రిటైర్డ్ ఏజ్ ఉన్న ముసలామే రావడంతో స్టోరీ క్రాక్ ఎక్కిస్తుంది.

వద్దురా బాబు అని పారిపోదామన్నా కుదరదు, ఎందుకంటే అప్పటికే ఆట మొదలైపోతుంది. జైమ్ ప్లాన్ రివర్స్ అయ్యి, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా కథ తయారవుతుంది. మిగిలిన సినిమా అంతా ఆ గదిలోనే జరుగుతుంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, ఆ రాత్రి వాళ్ళు మాట్లాడుకునే పిచ్చి మాటలు, చేసే పనులు ఒక రేంజ్‌లో నవ్విస్తాయి. ఎవరిని చూసి ఎవడు భయపడుతున్నాడో అర్థం కాదు. చివరికి తన పెళ్ళాం విలువ జైమ్‌కి తెలిసిందా? లేక ఆ గందరగోళంలో ఇంకేమైనా అయ్యిందా? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×