E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 17: ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతమైన యోగం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 17: ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతమైన యోగం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దీర్ఘకాలిక ఋణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది.  సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. 

వృషభం

Advertisement

ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. 

మిథునం

ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. 

కర్కాటకం

Advertisement

కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఆర్ధికపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. 

కన్య

సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పైవారి నుండి మాట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

వృశ్చికం

నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. 

ధనుస్సు

అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.  

మకరం

అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. 

కుంభం

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

మీనం

ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి.  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×