E-Paper
Advertisement

Friday OTT Release : పీరియాడిక్ నుంచి క్రైమ్ వరకు… ఈ శుక్రవారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Friday OTT Release : పీరియాడిక్ నుంచి క్రైమ్ వరకు… ఈ శుక్రవారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Friday OTT Release : ఈ ఏడాది రెండవ శుక్రవారం ఓటీటీ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. ఈ శుక్రవారం అంటే జనవరి 9న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని కొత్త సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ సిరీస్‌ లు విడుదల కాబోతున్నాయి. ఆ లిస్ట్ లో రొమాంటిక్ డ్రామాల నుండి సస్పెన్స్ థ్రిల్లర్‌ల వరకు అన్నీ ఉన్నాయి. మరి ఈ వారం రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు ఏంటి ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

People We Meet on Vacation

‘పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్’ అనే మూవీ ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ లో ఉంది. ఎమిలీ హెన్రీ రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఎమిలీ బాడర్, టామ్ బ్లైత్ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇద్దరు డిఫరెంట్ మనస్తత్వం ఉన్న ఫ్రెండ్స్ ప్రేమికులుగా మారితే ఎలా ఉంటుంది అన్న కథ. 2026 జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ మూవీని చూడవచ్చు.

Pitt Season 2

ఈ వారం మోస్ట్ అవైటింగ్ సిరీస్ లలో ‘ది పిట్ సీజన్ 2’ ముందు వరుసలో ఉంది. మొదటి సీజన్ సంఘటనల తర్వాత 10 నెలల తర్వాత సీజన్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. పెన్సిల్వేనియాలోని ల్యాండ్‌మార్క్ పిట్స్‌బర్గ్ ట్రామా మెడికల్ సెంటర్‌ లో నడుస్తుంది స్టోరీ అంతా. డాక్టర్ మైఖేల్ “రాబీ” రోబినావిచ్ (నోహ్ వైల్) పాత్ర ఇందులో కీలకం. సంవత్సరంలో అత్యంత రద్దీ సమయాల్లో ఒకటైన జూలై 4న ఏం జరిగింది అన్నది స్టోరీ. ఇది జనవరి 9 నుండి జియో హాట్‌స్టార్‌ (Jio hotstar)లో ప్రసారం అవుతుంది.

Freedom At Midnight Season 2  

‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2’ జనవరి 9న SonyLIVలో ప్రీమియర్ అవుతుంది. మొదటి సీజన్ లో భారతదేశ స్వాతంత్ర్యానికి దారితీసిన రాజకీయ చర్చలను చూపించారు. డొమినిక్ లాపియర్ అండ్ లారీ కాలిన్స్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందింన ఈ చారిత్రక డ్రామాలో సిద్ధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, చిరాగ్ వోహ్రా కీలక పాత్రల్లో నటించారు.

Alpha Males Season 4

‘ఆల్ఫా మేల్స్ సీజన్ 4’ అనే స్పానిష్ కామెడీ సిరీస్ జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ కథ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది,

A Thousand Blows season 2

‘ఎ థౌజండ్ బ్లోస్’ కొత్త సీజన్ కూడా ఈ వారమే రాబోతోంది. క్రైమ్ సిండికేట్ నాయకురాలు మేరీ కార్ (ఎరిన్ డోహెర్టీ) చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. ఆమె కొత్త ముప్పును ఎదుర్కోవడానికి మాజీ శత్రువులతో పొత్తు కుదుర్చుకుంటుంది. ఈ సిరీస్ జనవరి 9 నుండి జియో హాట్‌స్టార్‌ (Jio hotstar)లో ప్రసారం అవుతుంది.

Honeymoon Se Hatya

‘హనీమూన్ సే హత్య’ నిజమైన హత్యల ఆధారంగా రూపొందింన క్రైమ్ డాక్యుమెంటరీ. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసును ఇందులో చూపించబోతున్నారు. ఇది జనవరి 9 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది.

 

Read Also : ఈసారి మృతుడి కన్ను మిస్… కడుపుబ్బా నవ్వించే ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్

Tags

Related News

ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

Big Stories

×