E-Paper
Advertisement

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఇంట్రెస్టింగ్ గా 2 సినిమాలు..

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఇంట్రెస్టింగ్ గా 2 సినిమాలు..
Advertisement

Friday OTT Releases: ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర నెలకొంటుంది. ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని అలరించేందుకు వచ్చిస్తుంటాయి.. అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. దాంతో సంక్రాంతి సినిమాలనే ఎక్కువగా జనాలు చూస్తున్నారు.. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా ఓటీటీలో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచే కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఈ శుక్రవారం ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో వచ్చిన క్రైమ్ సిరీస్ ‘దల్దల్’, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’ లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోని పలు సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నారు. ఈ వీకెండ్ రాబోయే సినిమాలు, సిరీస్లు ఉన్నాయి. జనవరి 30న విడుదల అవుతున్న ప్రాజెక్ట్స్ లిస్ట్ చూడండి…

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 30 (రూమర్ డేట్)

మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 30

అమెజాన్ ప్రైమ్..

Advertisement

దల్ దల్ (హిందీ సిరీస్) – జనవరి 30

హాట్‌స్టార్..

సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 30

సన్ నెక్స్ట్..

పతంగ్ (తెలుగు సినిమా) – జనవరి 30

ఆపిల్ టీవీ ప్లస్..

యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30

జీ5..

దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) – జనవరి 30

ధురంధర్..

బాలీవుడ్ స్టార్ హీరో హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దురంధర్.. అండర్‌కవర్ RAW ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్, నిజ జీవిత యాంటీ-టెర్రర్ ఆపరేషన్ల ఆధారంగా రూపొందింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా.. దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను అందుకోవడం మామూలు విషయం కాదు.. థియేటర్లలో హిట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది…

‘సర్వం మాయ’..

మలయాళ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న కామెడి ఎంటర్టైనర్ మూవీ సర్వం మాయ.. శుక్రవారం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read :ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ టాప్ బ్యానర్ లో పవన్ కొత్త సినిమా..?

వీటితో పాటుగా మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్, పతంగ్, దేవ్‌కెళ్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. బాలీవుడ్ నుంచి వస్తున్న దురంధర్, సర్వం మాయం చిత్రాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఈ సినిమాలు రిలీజ్ డేట్ ని బ్లాక్ చేసుకున్నాయి. వీకెండ్ కొన్ని సినిమాలు సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తాయేమో చూడాలి.. ఇకపోతే ఫిబ్రవరి నెలలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. త్వరలోనే వాటి స్ట్రీమింగ్ డేట్ వివరాలు తెలిసే అవకాశం ఉంది..

 

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×