E-Paper
Advertisement

Samsung Galaxy Buds: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ధరలు, ఫీచర్లు లీక్.. యాపిల్‌కు గట్టి పోటీ తప్పదా?

Samsung Galaxy Buds: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ధరలు, ఫీచర్లు లీక్.. యాపిల్‌కు గట్టి పోటీ తప్పదా?
Advertisement

Samsung Galaxy Buds: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి నెక్ట్స్ జనరేషన్ ఇయర్‌బడ్స్ Galaxy Buds 4 సిరీస్‌ త్వరలోనే మార్కెట్‌లో విడుదల కానున్నాయి. అయితే, ఈసారి వినియోగదారులను మరింత ఖుషీ చేసేలా మరో గుడ్ న్యూస్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా కొత్త మోడల్స్‌తో పాటు ధరలు కూడా పెరుగుతుంటాయి. కానీ శాంసంగ్ మాత్రం ఈసారి ధరలను పెంచకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం.. గెలాక్సీ బడ్స్ 4 ధర రూ.16,000 ఉండగా.. ప్రీమియం వెర్షన్ బడ్స్ 4 Pro ధర రూ.22,500గా నిర్ణయించారు. అంటే.. ఫీచర్లు పెరిగినా, ధర మాత్రం పాత మోడల్స్‌తో సమానంగా ఉండబోతుందన్నమాట.

అప్రికాట్ కలర్ మ్యాజిక్..

ఈ కొత్త ఇయర్‌బడ్స్ లుక్ పరంగా అందరినీ కట్టిపడేయనున్నాయి. ఈసారి శాంసంగ్ తన క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ రంగులతో పాటు అప్రికాట్ అనే సరికొత్త రంగును పరిచయం చేస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా, ట్రెండీగా ఉండనుంది. అలాగే చెవిలో సౌకర్యవంతంగా ఇమిడిపోయేలా ఈ బడ్స్‌ను కాంపాక్ట్‌గా రూపొందించినట్లు సమాచారం.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ యూజర్లకు రూ.4,000 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఎలా పొందాలో చూసేయండి!

ఇంటెలిజెంట్ ఫీచర్లు..

టెక్నాలజీ పరంగా గెలాక్సీ బడ్స్ 4 సిరీస్‌లో భారీ మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లను మరింత పటిష్టం చేశారు. చుట్టూ ఎంత శబ్దం ఉన్నా స్పష్టమైన ఆడియో వినేలా అత్యాధునిక సెన్సార్లను దీనిలో వాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు Galaxy AI సాయంతో పనిచేసే ఇంటెలిజెంట్ ఫీచర్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. వాయిస్ క్లారిటీ నుంచి ఆటోమేటిక్ నాయిస్ అడ్జస్ట్‌మెంట్ వరకు ప్రతిదీ చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది.

ఫిబ్రవరిలో గ్రాండ్ ఎంట్రీ..

Advertisement

ఫిబ్రవరి చివరి వారంలో జరగబోయే Galaxy Unpacked 2026 ఈవెంట్‌లో గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్లతో పాటు ఈ ఇయర్‌బడ్స్ కూడా విడుద కానున్నాయి. లాంచ్ సందర్భంగా కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో వీటిని ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 25W వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను ఉచితంగా అందించే ప్లాన్‌లో శాంసంగ్ ఉంది. ఇండియాలో కూడా ఇలాంటి లాంచ్ ఆఫర్లు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. మోటరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్, పూర్తి వివరాలు ఇవిగో!

 

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×