E-Paper
Advertisement

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases :  శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు తియ్యటలలోకి సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే మరోవైపు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి. నిన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా రాంచరణ్ ఈ సినిమాలో కనిపించడంతో ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు.. ఈవారం థియేటర్లలోకి ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి. మొత్తానికి జూన్ నెలలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. అందులోను స్టార్ హీరోలు ఈనెల పోటీ పడుతున్నారు.. మరి ఈ నెలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..

ఈ శుక్రవారం ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈ వారం ఏకంగా 15 సినిమాలు మూవీ లవర్స్ ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. దురంధర్‌-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో పాటుగా అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.. శుక్రవారం మామూలు సినిమాలతో పాటుగా డబ్బింగ్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం.

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

జియో హాట్‌స్టార్..

ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 05

అమెజాన్ ప్రైమ్..

ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) – జూన్ 05

పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05

సన్ నెక్స్ట్..

ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 05

ఆహా..

అగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5

నెట్‌ఫ్లిక్స్..

29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 05

మెక్సికో 86 (స్పానిష్ సినిమా) – జూన్ 05

ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 05

టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) – జూన్ 05

ద మార్క్‌డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) – జూన్ 05

స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06

యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) – జూన్ 07

జీ5..

పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 05

కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 05

బ్రౌన్ (హిందీ సిరీస్) – జూన్ 05

సోనీ లివ్..

గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 05

ఆపిల్ టీవీ..

కేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05

ఓటీటీలోకి ఈవారం తెలుగు సినిమాలతో పోలిస్తే డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు వీటిని ఎప్పుడెప్పుడు చూస్తామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం థియేటర్లో పెద్ది హవా నడుస్తుంది.. వచ్చేవారం స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి.. మొత్తానికి సమ్మర్ ఎండింగ్ అయిన జూన్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మరి ఈ నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద వార్ నడుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఈ వారం కాస్త ఎక్కువగానే సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది..

Tags

Related News

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

Big Stories

×