E-Paper
Advertisement

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !
Advertisement

Sanjay Manjrekar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నిలిచిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలుగా టైటిల్ కోసం పోరాడిన బెంగుళూరు, రజత్ పాటిదార్ కెప్టెన్సీ లో మాత్రం వరుసగా రెండు టైటిల్స్ గెలుచుకుంది. దీంతో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పైన (Rajat Patidar) ప్రశంసల వర్షం కురుస్తోంది. వెంటనే అతన్ని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకువెళ్లాలని, డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, కెప్టెన్ గా కూడా అతన్ని చేయాలని చేయాలంటున్నారు. సూర్య కుమార్ యాదవ్ చెత్త కెప్టెన్సీ వల్ల టీమిండియా జట్టుకు నష్టం జరుగుతోందని.. బెంగళూరుకు టైటిల్స్ వరుసగా తీసుకువచ్చిన రజత్ పాటిదార్ ను కెప్టెన్ చేయాలని సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు కూడా పేర్కొంటున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు

Advertisement

టీమిండియా టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టి.. శ్రేయస్ అయ్యర్ ను కాదని.. రజత్ పాటిదార్ ను చేయాలంటూ వస్తున్న వార్తలపై సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) స్పందించారు. 33 ఏళ్ల వయస్సు గల రజత్ పాటిదార్ ను ఈ సమయంలో టి20 కెప్టెన్ గా చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదని వెల్లడించారు. సాధార‌ణంగా జ‌ట్టులోకి తీసుకుంటే, ప‌ర్లేదు కానీ.. కెప్టెన్ చేయ‌కూడ‌ద‌ని కోరారు. ఇప్పటికే ఏజ్ బార్ అయిన సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ చేసి బిసిసిఐ తప్పు చేసిందని ఫైర్ అయ్యారు. ఇక అతన్ని పక్కకు పెట్టి శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని సూచనలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండు టైటిల్స్ తీసుకు వచ్చాడని ఆవేశపడి, రజత్ పాటిదార్ కు కెప్టెన్సీ అవకాశం ఇవ్వకూడదని రిక్వెస్ట్ చేశారు. దీంతో సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై బెంగళూరు అభిమానులు సీరియస్ అవుతున్నారు. బెంగళూరు జట్టును రెండుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రియల్ హీరో రజత్ పాటిదార్ అని, అలాంటోడిని పక్కకు పెట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు. కొంతమంది చేతగాని వెధవల మాటలు బిసిసిఐ అస్సలు వినకూడదని కోరుతున్నారు.

త్వ‌ర‌లోనే సూర్య‌పై వేటు, అతనికి ఛాన్స్

ప్లేయర్ గా విఫలమవుతున్న సూర్యకుమారి యాదవ్ ను పక్కకు పెట్టి టీమిండియా టి20 జట్టుకు కొత్త ప్లేయర్ ను కెప్టెన్ చేయాలని బిసిసిఐ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సంజు శాంసన్ ను కెప్టెన్ చేయాలని గౌతమ్ గంభీర్ డిమాండ్ చేస్తుంటే.. శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలని అజిత్ అగార్కర్ రిపోర్ట్ సిద్ధం చేశారట. ఇద్దరిలో దాదాపు శ్రేయస్ అయ్యర్ కు అవకాశం వస్తుందని అంటున్నారు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

 

Related News

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

Big Stories

Advertisement
×