E-Paper
Advertisement

కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!

కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!
Advertisement

ఇండియన్ కార్ల మార్కెట్లో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు కొత్త కారు కొనడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారిలో చాలామంది కొత్త ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్‌ ల కంటే సెకండ్ హ్యాండ్ SUVలు, ప్రీమియం కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి వెహికల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

రెడ్‌ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ఆసక్తికర నివేదిక

దేశంలో కార్ల కొనుగోలుకు సంబంధించి రెడ్‌ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజాగా కీలక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ రాబోయే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 60 లక్షల వాహనాలు అమ్ముడవుతుండగా, 2031 నాటికి ఈ సంఖ్య 90 నుంచి 100 లక్షల యూనిట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

Advertisement

అంతేకాదు, ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో దాదాపు 65 శాతం మంది మొదటిసారి కారు కొనుగోలు చేసిన వాళ్లే కావడం విశేషం. వీరిలో చాలామంది చిన్న కొత్త కారును కొనుగోలు చేయడం కంటే అదే ధరలో లభించే పెద్ద SUV లేదంటే ప్రీమియం మోడల్‌ ను కొనడం మంచిది అనుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు తప్పనిసరిగా భావించిన స్టార్టర్ హ్యాచ్‌ బ్యాక్ కాన్సెప్ట్ క్రమంగా బలహీనపడుతోంది.

సెకెండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు ఎందుకు పెరుగుతోంది?

సెకెండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు ప్రధాన కారణం నమ్మకమైన డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ ల పెరుగుదల. Cars24 వంటి సంస్థలు వెహికల్స్ చెకింగ్, వారంటీలు, ఫైనాన్సింగ్, డాక్యుమెంటేషన్, ఓనర్ ట్రాన్స్ ఫర్ బదిలీ లాంటి సేవలను ఒకే చోట అందిస్తున్నాయి. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లపై వినియోగదారుల నమ్మకం పెరుగుతోంది.

SUVలపై పెరుగుతున్న ఆసక్తి!

Advertisement

మరో ముఖ్యమైన అంశం SUVలపై పెరుగుతున్న ఆసక్తి. భారతీయ కొనుగోలుదారులు ఇప్పుడు పెద్ద వాహనాలు, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లు, సన్‌ రూఫ్‌ లు, కనెక్టెడ్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్ లాంటి ఫీచర్లను కోరుకుంటున్నారు. అయితే, కొత్త SUV కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే వాహనం కొన్నేళ్ల పాతదైతే చాలా తక్కువ ధరలో లభిస్తోంది. అందుకే చాలా మంది సెకండ్ హ్యాండ్ SUVలను ఎంచుకుంటున్నారు. నిజానికి కొత్త కార్లను 7-8 సంవత్సరాలు వాడే ధోరణి తగ్గుతోంది. ఇప్పుడు చాలా మంది 4-5 సంవత్సరాల్లోనే వాహనాలను మార్చేస్తున్నారు. దీంతో మంచి కండిషన్‌ లో ఉన్న వాడిన కార్లు మార్కెట్లోకి వేగంగా వస్తున్నాయి. ఇది కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తోంది.

ఎదురవుతున్న సవాళ్లు ఏంటంటే?  

అయితే, సెకెండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు మార్కెట్ ఎదుగుదలకు ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లలో దాదాపు సగం లావాదేవీలు అసంఘటిత డీలర్ల ద్వారానే జరుగుతున్నాయి. ధరలలో పారదర్శకత లేకపోవడం, వాహన నాణ్యతపై సందేహాలు, డాక్యుమెంటేషన్ సమస్యలు ఇంకా కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ, ఫైనాన్సింగ్ సౌకర్యాలు పెరగడం, డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ల విస్తరణ, మెరుగైన తనిఖీ వ్యవస్థలు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ ను మరింత బలోపేతం చేస్తున్నాయి.

Read Also: సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×