E-Paper
Advertisement

రాత్రైతే ఊరిని వల్లకాడు చేసే వింత పిశాచాలు… ఒంటరిగా చూడకూడని హర్రర్ సిరీస్

రాత్రైతే ఊరిని వల్లకాడు చేసే వింత పిశాచాలు… ఒంటరిగా చూడకూడని హర్రర్ సిరీస్
Advertisement

Horror Mystery Thriller OTT : హాలీవుడ్ సినిమాలు కొన్ని ఊహకు అందని విధంగా ఉంటాయి. అలాగే సిరీస్ లు కూడా అద్భుతంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీల పుణ్యమా అని వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగడంతో, ఊహించని కథలతో మేకర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. టైటిల్ లో ఉన్నట్టుగానే ఆ ఊర్లోకి అడుగు పెడితే జనాలు తిరిగిరారు. మరి ఈ వింత పిశాచాల కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఇప్పడు మనం చెప్పకుంటున్న సిరీస్ పేరే From (2022). జాన్ గ్రిఫిన్ రూపొందించిన ఈ అద్భుతమైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ కథ మొత్తం అమెరికాలోని ఒక మారుమూల పట్టణంలో నడుస్తుంది. భారతదేశంలో ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Video లో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ 3 సీజన్లు సక్సెస్ ఫుల్ గా విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు 4వ సీజన్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సిరీస్ ‘Lost’ సిరీస్ తరహాలో మిస్టరీ, హారర్ మిక్స్ తో అద్భుతంగా సాగుతుంది. .

కథలోకి వెళ్తే…

Advertisement

అమెరికాలోని మారుమూల ఉండే సిటీ అది. ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే, ఆ ఊర్లోకి ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేరు. వింతేమిటంటే పట్టణానికి వచ్చే దారులన్నీ తిరిగి ఒకే చోటికి చేరుస్తాయి. దీంతో అక్కడికి వచ్చిన వారు ఆ ఊర్లోనే బందీలుగా ఉండిపోవాల్సి వస్తుంది. పగలు ఈ సిటీ చూడటానికి మామూలుగానే ఉంటుంది. కానీ రాత్రి అయ్యేసరికి అడవి నుండి వింత జీవులు వస్తాయి. అవి మనుషుల రూపంలో ఉండే భయంకరమైన రాక్షసులు. మనుషులను వేటాడి, శరీర భాగాలను పీక్కు తినడమే వాటి పని. అందుకే సూర్యాస్తమయం కాగానే ఆ పట్టణంలోని వారందరూ ఇళ్లలోకి వెళ్లి, డోర్స్ క్లోజ్ చేసుకుంటారు.

Also Read : గడప దాటి లోపలికి వస్తే శవంగా బయటకు… ఈ ఆత్మల కొంప క్లైమాక్స్ మామూలుగా ఉండదు

Advertisement

అయితే రాక్షసులు డోర్ బద్దలు కొట్టుకుని రాగలవు. కాబట్టి ఇంటి గుమ్మాల దగ్గర ‘తలిస్మాన్’ అనే ఒక రకమైన గుర్తులు ఉన్న రాళ్లు వేసుకుంటారు. అవి ఈ రాక్షసుల నుండి వాళ్ళని కాపాడతాయి. ఇక ఈ పట్టణానికి షెరీఫ్ – మేయర్ ఇద్దరూ ఒక్కరే. ఆయనే బోయ్డ్ స్టీవెన్స్ (హెరాల్డ్ పెర్రినో). కాగా కథ ప్రారంభంలోనే మ్యాథ్యూస్ కుటుంబం తెలియకుండా వచ్చి ఈ పట్టణంలో చిక్కుకుపోతుంది. మ్యాథ్యూస్ కుటుంబం, ఇతరులు అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో రేడియో టవర్ నిర్మించడానికి జిమ్ మ్యాథ్యూస్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే టాబిథా మ్యాథ్యూస్ తవ్విన గోడ కింద ఒక రహస్య సొరంగం ఉందని కనిపెడతారు. ఆ సొరంగం ఏంటి? అది ఎక్కడికి దారి తీస్తుంది ? మాథ్యూస్ కుటుంబం అక్కడి నుంచి బయట పడిందా ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×