E-Paper
Advertisement

గడప దాటి లోపలికి వస్తే శవంగా బయటకు… ఈ ఆత్మల కొంప క్లైమాక్స్ మామూలుగా ఉండదు

గడప దాటి లోపలికి వస్తే శవంగా బయటకు… ఈ ఆత్మల కొంప క్లైమాక్స్ మామూలుగా ఉండదు
Advertisement

Horror Movie OTT : సూపర్ నేచురల్ హర్రర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాల కోసమే ఓటీటీలో స్పెషల్ గా సర్చ్ చేసే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అందులో మీరు కూడా ఒకరైతే ఈరోజు మన మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఓటీటీలలో దొరకని మూవీ

ఈ హర్రర్ థ్రిల్లర్ పేరు Haunt (2013). ఇదొక అతీంద్రియ హారర్ థ్రిల్లర్. ఒక పాత ఇంట్లోని రహస్యాలు, అక్కడ నివసించే ఆత్మల చుట్టూ ఈ భయంకరమైన సినిమా స్టోరీ తిరుగుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రముఖ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కు అందుబాటులో లేదు. అయితే Amazon Prime Video లో కొన్ని రీజియన్లలో దొరుకుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే Tubi అనే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీని ఫ్రీగానే చూడవచ్చు. ఈ చిత్రంలో హారిసన్ గిల్‌బర్ట్‌సన్, లియానా లిబరాటో ప్రధాన పాత్రల్లో నటించగా, మాక్ కార్టర్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ హారర్ సినిమాల జానర్లో ఉండే ఈ మూవీ హర్రర్ మూవీ లవర్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమా కథ ఇవాన్ అనే టీనేజ్ కుర్రాడితో స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఫ్యామిలీ ఒక పెద్ద పాత విల్లాను కొంటారు. ఫ్యామిలీ సమేతంగా కొత్త ఇంటికి మారతారు. అయితే ఆ ఇంట్లో గతంలో మోరెల్లో అనే ఫ్యామిలీ ఉండేది. వాళ్ళే ఆ ఇంటి ఓనర్స్. ఇవాన్ ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ చాలామంది చనిపోయారని స్థానికులు చెప్పుకుంటూ ఉండడం వింటారు. మరోవైపు ఇవాన్ ఆ ఇంటి సమీపంలో ఉండే సమంతా అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ మొదలెడతాడు. ఇద్దరూ కలిసి ఆ ఇంటి అటకపై ఉన్న ఒక వింత పాత రేడియో బాక్స్‌ను కనిపెడతారు.

Also Read : కళ్లు చెదిరే విజువల్స్…శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తొమ్మిది తోకల నక్క… ఆకట్టుకుంటున్న ఫాంటసీ సిరీస్

Advertisement

ఆ బాక్స్ ద్వారా చనిపోయిన వారితో మాట్లాడవచ్చు అనే విషయం తెలుస్తుంది. దీంతో సరదాగా ప్రయత్నిద్దాం అనుకుంటారు. ఫలితంగా నిజమైన దయ్యాలను నిద్రలేపుతారు. ఆ రేడియో బాక్స్ వాడటం మొదలు పెట్టిన దగ్గర నుండి ఆ ఇంట్లో వింత సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతుంది. ఇవాన్‌ కు తన చుట్టూ ఏదో ఆత్మ తిరుగుతున్నట్టు, తనను ఎవరో గమనిస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఇంట్లోని ఆత్మలు ఇవాన్ – సమంతా ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాయి. అసలు ఆ ఇంట్లో మోరెల్లో ఫ్యామిలీ ఎలా ఎందుకు చనిపోయింది ? ఆ రేడియో బాక్స్‌కు ఆత్మలకు ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కాబట్టి డోంట్ మిస్.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×