E-Paper
Advertisement

ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షాకింగ్ ఆరోపణలు!

ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షాకింగ్ ఆరోపణలు!
Advertisement

MLC Dasoju Sravan: ప్రజా సమస్యలు బయటకు రావొద్దని బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సమస్యలపై మా ధర్మ యుద్ధం కొనసాగుతుందన్నారు. భూ దొంగలు చెలరేగుతున్నారని హైదరాబాద్ ,రంగారెడ్డి ఫ్యూచర్ సిటీ వాసులను హెచ్చరించారు.

నాదర్ గుల్ లో 613 /119 సర్వే నెంబర్ 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, సీలింగ్ కు లోబడి భూములు లేవు అన్నారు. 2020లో హై కోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిందని, ఈ కేసు సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉందన్నారు. కొంతమంది ఆ భూమి తమదని ఫేక్ డాక్యుమెంట్లతో ముందుకు వస్తున్నారని, తెలంగాణ లో రాజ్యాంగం ఉందా ? అని మండిపడ్డారు.

Advertisement

కొత్వాల్ గూడ ,మానస హిల్స్ ,వట్టి నాగుల పల్లి, నాదర్ గుల్ లో వేలాది ఎకరాలు దోచుకుంటున్నారని ఇదేనా జై సంవిధాన్ ? అని నిలదీశారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును వేరే రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఏఐసీసీ కి ఏటీఎంగా తెలంగాణ మారిందన్నారు. ‘కేసు సుప్రీం కోర్టు లో ఉండగా నాదర్ గుల్ భూముల్లో ఫెన్సింగ్ ఎలా పెడుతారు ? కలెక్టర్, ఆర్డీఓ ఏం చేస్తున్నారు’ అని నిలదీశారు.

Also Read: BSNL ఐకానిక్ రీఛార్జ్ ప్లాన్.. కేవలం ఒక్క రూపాయికే.. నెలంతా అపరిమిత సేవలు!

Advertisement

ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 50 ఎకరాలను వదిలిపెట్టి మిగతా 325 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణలు తొలగించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మేమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, నరసింహ గౌడ్ సైతం పాల్గొన్నారు.

Also Read: అంకెల్లో తెలంగాణ జోరు.. అప్పుల్లో కేరళ తీరు, పినరయి విజయన్‌కు సీఎం రేవంత్ కౌంటర్

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×