BigTV English
Advertisement

OTT Movie : భార్య ఫ్రెండ్ పై భర్త కన్ను… స్మార్ట్ ఫోన్ లో ప్రైవేట్ వీడియో… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : భార్య ఫ్రెండ్ పై భర్త కన్ను… స్మార్ట్ ఫోన్ లో ప్రైవేట్ వీడియో… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ తొందర్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. అక్రమ సంబంధం కారణంగా ఒక ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది. ఈ క్రమంలో భార్య, భర్తని చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే స్టొరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


టెంట్కొట్టా  (Tentkotta)

ఈ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జెంటిల్ వుమన్’ (Gentle women). ఈ మూవీకి జాషువా సేతురామన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో లీజోమోల్ జోస్, లోస్లియా మరియనేశన్, హరి కృష్ణన్ ప్రధాన పాత్రలలో నటించగా,  రాజీవ్ గాంధీ, ధరణి, వైరాబాలన్, నందిత శ్రీకుమార్, సుదేష్  సహాయక పాత్రల్లో నటించారు. జెంటిల్ వుమన్ 7 మార్చి 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తొందర్లో టెంట్కొట్టా  (Tentkotta) ఓటిటిలోకి రాబోతుందని సమాచారం.


స్టోరీ లోకి వెళితే

పూర్ణ, అరవింద్ కి కొత్తగా వివాహం జరుగుతుంది. ఈ భార్యాభర్తలు చాలా సరదాగా ఉంటారు. భార్య వంటలు చేయడంలో దిట్ట. ఆ వంటలను ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు భర్త. ఒకరోజు పూర్ణ ఫ్రెండ్ కి ఎగ్జామ్స్ ఉండటంతో, ఆమె దగ్గర రెండు రోజులు ఉండటానికి వస్తుంది. భర్త ఆఫీస్ పని మీద మూడు రోజులు బయటకి వెళ్లాలని చెప్తాడు. ఇలా ఉండగా పూర్ణ ఇంటికి వచ్చిన ఆమె ఫ్రెండ్ మీద అరవింద్ అసభ్యంగా ప్రవర్తిస్తాడు.  ఆ తరువాత అనుకోకుండా కింద పడి స్పృహ కోల్పోతాడు అరవింద్. విషయం తెలుసుకొని పూర్ణ చాలా బాధపడుతుంది. అరవింద్ ఫోన్ కి యానా అనే అమ్మాయి ఫోన్ చేసి, గోవా కి టైం అవుతుంది అంటూ మాట్లాడుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన పూర్ణికి అప్పుడు అర్థం అవుతుంది తన భర్త చాలా దుర్మార్గుడు అని. కోపంలో అతని గొంతు కోసి చంపేస్తుంది పూర్ణ. తన ఫ్రెండ్ మీదకి ఈ కేసు రాకుండా అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తుంది.

ఆ తర్వాత తన ఫోన్ అరవింద్ లిఫ్ట్ చేయకపోవడంతో, యానాకి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసుల విచారణ చేయడం మొదలుపెడతారు. అయితే అరవింద్ ఫోన్ లో యానా ప్రైవేట్ వీడియో ఉంటుంది. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసుకుని ఉంటారు. దానిని చూపిస్తూ ఏసిపి యానాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు యానా ఏసీపీని చంపేస్తుంది. నిజానికి యానా, అరవింద్ ఇదివరకే పెళ్లి చేసుకుంటారు. ఇంట్లో బలవంతం చేయడంతో అరవింద్, పూర్ణని పెళ్లి చేసుకుని ఉంటాడు. చివరికి పూర్ణ పోలీసులకు దొరుకుతుందా? యాన పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘జెంటిల్ వుమన్’ (Gentle women) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×