Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన మూవీ పుష్ప 2.. గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. రెండు నెలలు జోరు తగ్గకుండా వసూల్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్ల తో కేజీఎఫ్ 2, బాహుబలి సిరీస్ ల రికార్డులను తిరగరాసింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.. సినిమా స్టోరీ తో పాటుగా పాటలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ముఖ్యంగా జాతర సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సాంగ్ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
పుష్ప 2 సాంగ్స్..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్లో నిర్మించిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ బాగా హీట్ అయ్యాయి. కిసిక్ సాంగు యువతను బాగా ఆకట్టుకుంటే, గంగమ్మ జాతర సాంగ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఈ పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన గణేష్ ఆచార్య తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గంగో రేణుక తల్లి పాట చిత్రీకరణ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మూవీలోని ప్రతి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గంగమ్మ సాంగ్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్కి కాలికి గాయాలయ్యాయి. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ఆ సాంగ్ ని పూర్తి చేయాలని పట్టుబట్టాడు. అలా సాంగ్ బాగా హిట్ అయింది.
Also Read : ఐదు వారాలైన తగ్గని జోరు.. పుష్ప 2 రికార్డ్ బ్రేక్..
నిజాన్ని బయటపెట్టిన కొరియోగ్రాఫర్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గణేష్ మాస్టర్ జాతర సాంగ్ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించారు.. ఈ సాంగ్ పూర్తి చేయడం పెద్ద సవాల్ గా మారిందని ఆయన అన్నారు. దాదాపు 29 రోజుల పాటు నిరంతరాయంగా చిత్రీకరించడం చాలా కష్టమైన పని. కానీ ఈ సాంగ్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్‌కే చెందుతుంది. పుష్ప రెండు చిత్రాలకు ఆయన ఐదేళ్లు అంకితమిచ్చారు.. రెండు చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి.. గణేష్ మాస్టర్ తెలుగుతో హిందీలో కూడా పలు చిత్రాలకు మాస్టర్ గా వ్యవహారిస్తున్నారు. గోవిందా, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ఇక పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3 మూవీ కూడా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..