BigTV English

OTT Movie : అమ్మాయితో ఆ పని చేస్తూ మధ్యలోనే పరలోకానికి… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అమ్మాయితో ఆ పని చేస్తూ మధ్యలోనే పరలోకానికి… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ లపై కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా ఈ జానర్లో వచ్చిన సినిమాలు ఓ అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో, ఎప్పుడు పోయాయో కూడా తెలిసేది కాదు. కానీ ఈ మూవీ సృష్టించిన సంచలనంతో సర్వైవల్ థ్రిల్లర్ అనే పేరు విన్పించినా చాలు చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.అలాంటి వారి కోసం ఓ ఉత్కంఠభరితమైన మూవీని తీసుకొచ్చాము. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? పేరేంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

జెస్సీ బర్లింగేమ్, ఆమె భర్త గెరాల్డ్ వైవాహిక బంధంలో సమస్యలు మొదలవుతాయి. వాటిని పరిష్కరించడానికి ఓ రిస్క్ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం ఒక రిమోట్ లేక్ హౌస్‌ లో ప్రైవేట్ గా గాడపాలని అనుకుంటారు. ఇక అక్కడి వచ్చిందే తడవు కొత్త ఉత్సాహంతో పాటు కొత్త కోరికలు కూడా ఉరకలేస్తాయి. ఏజ్ తో సంబంధం లేకుండా సన్నిహితంగా గడపడానికి అదిరిపోయే ఫ్యాంటసీ ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగా గెరాల్డ్ జెస్సీని హ్యాండ్‌ కఫ్‌లతో బెడ్‌ కు కట్టేస్తాడు. జెస్సీకి ఈ ఆలోచన సౌకర్యంగా లేనప్పటికీ భర్త కోసం అంగీకరిస్తుంది. ఇంకేముంది భార్య కాళ్ళూ చేతులూ పకడ్బందీగా కట్టేసి, ఆట మొదలెడతాడు.


అయితే గేమ్ మొదలైన కొద్ది సేపటికే గెరాల్డ్‌ కు గుండెపోటు రావడంతో అతను అకస్మాత్తుగా అక్కడికక్కడే చనిపోతాడు. మరోవైపు జెస్సీ హ్యాండ్‌ కఫ్‌లతో బెడ్‌ కు కట్టేసి ఉంటుంది. పైగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమెకు కట్టిన కట్లు తెంచుకోలేని స్థితిలో ఉండిపోతుంది. హెల్ప్ అడుగుదామంటే ఫోన్ దగ్గరలో ఉండదు. సహాయం కోసం అరిచినా ఎవ్వరికీ వినబడని ప్లేస్ లో ఉంటారు వాళ్ళు. ఇక అప్పుడు మొదలవుతుంది చూడు కథలో మలుపు. ఓవైపు భర్త శవం, మరొవైపు బెడ్ పై కట్లతో కదలలేని స్థితిలో ఆ అమ్మాయి. కాసేపటికే ఆకలి, దాహం, అంతలోనే ఆమె గతం గిర్రున తిరగడం… అంతేనా హాలోజీనేషన్, సీరియల్ కిల్లర్ కన్పించడం కూడా… చావు బతుకుల మధ్య బ్రతకడానికి ఆమె చేసే పోరాటాన్ని చూసి తీరాల్సిందే. అసలు హీరోయిన్ గతం ఏంటి? ఆ సీరియల్ కిల్లర్ నిజమైన వాడేనా లేక ఆ అమ్మాయి ఊహనా ? చివరకు హీరోయిన్ ఎలా తప్పించుకుంది అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. చివర్లో వచ్చే ట్విస్ట్ హైలెట్ గా ఉంటుంది.

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘Gerald’s Game’. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా మైక్ ఫ్లానాగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఇందులో కార్లా గుగినో, బ్రూస్ గ్రీన్‌వుడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×