Nindu Noorella Saavasam Serial Today Episode: బస్టాండ్‌లో ఆగిన చిత్ర బ్లాక్ మెయిలర్ లా మనోహరికి ఫోన్ చేస్తుంది. డబ్బు తీసుకుని నేను చెప్పిన చోటికి వచ్చావా అని అడుగుతుది. నేను రాలేదు.. నా ఫ్రెండ్ వచ్చింది అని మనోహరి చెప్పగానే.. అయితే నేను అమరేంద్రకు కాకుండా ఆయన భార్య భాగీకి నిజం చెప్పమంటావా అని బెదిరిస్తుంది. దీంతో మనోహరి కోపంగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు డబ్బులు అడిగావు ఇస్తున్నాను ఎవరు ఇస్తే ఏంటి..? అంటూ ఫోన్ మ్యూట్‌లో పెట్టి మరో ఫోన్ నుంచి రణవీర్‌కు ఫోన్ చేసి చిత్ర ఫోన్ మాట్లాడుతుందా..? అని అడుగుతుంది. రణవీర్ చూసి తన హెయిర్ అడ్డుగా ఉంది సరిగ్గా కనిపించడం లేదు అని చెప్తాడు. అయితే దగ్గరకు వెళ్లి చూడు అని మనోహరి చెప్తుంది. దీంతో రణవీర్ కారు దిగి చిత్ర దగ్గరకు వెళ్తుంటాడు.
చిత్ర… హలో మను.. అంటుంది. ఆ ఉన్నాను ఫ్లీజ్ ఈ ఒక్కసారి అర్థం చేసుకో అమర్‌కు నా మీద డౌటు వచ్చింది. నేను డైరెక్టుగా వచ్చి డబ్బులు ఇవ్వడం కుదరదు అని చెప్తుంది. దీంతో చిత్ర ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొక్క సారి అంటూ రణవీర్‌ను చూసి భయపడుతుంది. మనోహరి, రణవీర్‌ను అది ఫోన్ మాట్లాడుతుందా..? అని అడుగుతుంది. వెళ్తున్నాను అని చెప్పగానే.. మనోహరి చిత్రను హలో నా ఫ్రెండ్ డబ్బులు తీసుకుని వచ్చింది. డబ్బులు ఎక్కడ పెట్టాలో చెబితే నా ఫ్రెండ్ పెట్టేస్తుంది అని చెప్తుంది. చిత్ర ఫోన్ మాట్లాడదు.. దీంతో రణవీర్ చిత్ర ఆటో ఎక్కి వెళ్లిపోతుంది అని చెప్పగానే.. ఏయ్ ఫాలో అవ్వు అని మనోహరి చెప్పగానే రణవీర్ కారు దగ్గరకు వెళ్తాడు. ఇంతలో అక్కడకు అమర్ వస్తాడు. అమర్‌ను చూసిన రణవీర్ షాక్ అవుతాడు. అమర్ వచ్చాడు ఫోన్ కట్ చెయ్ అని చెప్తాడు.
అంతా ఆటోలో నుంచి గమనిస్తున్న మిస్సమ్మ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అనుకుంటుంది. అమర్ దగ్గరకు వెళ్లగానే.. హలో అమరేంద్ర గారు మీరేంటి ఇక్కడ అని అడగ్గానే.. అది నేను అడగాలి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు. నీకు చిత్ర తెలుసా..? అని అడగ్గానే.. చిత్రనా తెలియదు అమరేంద్ర గారు ఎవరు తను అంటాడు రణవీర్. దీంతో రాథోడ్ మీరు ఇందాక నుంచి ఫాలో అవుతూ వచ్చారు కదా ఆ అమ్మాయి సార్ అని చెప్తాడు. బస్టాప్‌లో కూడా తనతో మాట్లాడాలని చూశారు కదా చిత్ర ఎలా తెలుసు నీకు చిత్రకు నీకు ఏంటి పరిచయం అని అమర్ అడగ్గానే.. మనిషే తెలియదు అంటుంటే ఎలా పరిచయం అంటే ఏమని చెప్తాము అమరేంద్ర గారు నేను ఎవరిని ఫాలో అవుతూ ఇక్కడికి రాలేదు. నా వైఫ్ ఈ ఏరియాలో కనిపించింది అని చెబితే తన కోసమే కోల్ కతా నుంచి ఉదయమే వచ్చాను. రోజూ ఇదే బస్టాప్ కు వస్తుందని చెప్పారు.
అందుకే ఇక్కడే ఉంటే కనిపిస్తుందని ఇక్కడికి వచ్చాను అని రణవీర్ చెప్పగానే.. అవునా.. నేను ఇంకేదో అనుకున్నాను అంటాడు అమర్. దీంతో రణవీర్ ఏమైంది అమరేంద్ర గారు ఇంట్లో అంతా ఓకేనా..? మొన్న కూడా ఇలానే ఏదో డౌటు అని కోల్‌కతా వరకు వచ్చారు.. ఇప్పుడేమో ఇలా .. ఆర్‌యూ ఓకే అమరేంద్ర గారు.. యా ఐ ఆయమ్ ఫైన్ జస్ట్ జాగ్రత్తగా ఉంటున్నాను.. నీ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వు మా వాళ్లతో వెతికిస్తాను.. అని అమర్ అడగ్గానే.. రణవీర్ టెన్షన్ పడుతుంటాడు టెన్షన్ పడతారేంటి సార్ ఇవ్వండి అని రాథోడ్ చెప్పగానే.. చాలా రోజులు తర్వాత కనిపించింది సార్ తనని పోలీసులు ఫాలో చేస్తున్నారు అని తెలిస్తే మళ్లీ కనిపించకుండా పోతుందేమో అని డౌటు క్రియేట్ చేయగానే అమర్ సరే అంటూ వెళ్లిపోతాడు. దూరం నుంచి అంతా గమనిస్తున్న మిస్సమ్మ కన్‌ఫం మనోహరి మళ్లీ ఏదో ప్లాన్ చేసింది. అదేంటో కనిపెట్టాలి అనుకుంటుంది.
మరోవైపు కంగారుగా ఇంటికి వెళ్లిన చిత్రను చూసి మనోహరి ఉలిక్కిపడుతుంది. చిత్ర భయంతో జస్ట్ మిస్ అమరేంద్ర గారికి దొరికిపోయి ఉండేదాన్ని అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ నటించకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. బెదిరిస్తుంది నువ్వే అని నాకు తెలుసు. అది కనిపెట్టడానికే ఇవాళ నిన్ను వెళ్లమని చెప్పాను. నిజం చెప్పు నువ్వే కదా నన్ను బెదిరిస్తుంది. అంటూ మనోహరి నిలదీస్తుంది. ఇంతలో అమర్, రాథోడ్ అక్కడకు వస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?