OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ కంటెంట్ తో ఒక ఊపు ఊపిన సినిమా ‘గాన్ గర్ల్’. ఈ సినిమా అంచనాలు లేకుండా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. $61 మిలియన్ ల బడ్జెట్ తో $369 మిలియన్ ల కలెక్షన్స్ సాధించింది. అంతే కాకుండా అకాడమీ అవార్డులో అమీ డన్ పాత్రలో రోసముండ్ పైక్ నటనకు ఉత్తమ నటిగా నామినేషన్ కూడా లభించింది. బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ బ్రిటిష్ చిత్రం, పైక్‌కు ఉత్తమ నటితో సహా పలు నామినేషన్లు వచ్చాయి. వీటితో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ స్టోరీ మానిప్యులేషన్ థీమ్స్‌తో పాపులర్ అయింది. భర్తను, ప్రియుడిని ఒక ఆట ఆడుకునే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
“గాన్ గర్ల్” (Gone Girl) 2014లో డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. గిలియన్ ఫ్లిన్ బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బెన్ అఫ్లెక్, రోసముండ్ పైక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2014 అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైంది. 149 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
నిక్, అమీ అనే జంట తమ ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో, అమీ అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. నిక్ ఇంటికి తిరిగి వచ్చే సరికి, అక్కడ అంతా చిందర వందరగా ఉంటుంది. ఎవరితోనో గొడవ జరిగిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆమె కనిపించకుండా పోవడంతో పోలీసు దర్యాప్తు మొదలవుతుంది. మీడియా దృష్టి మొత్తం ఈ కేసుపై పడుతుంది. మీడియా దృష్టిలో అతనే తన భార్యను హత్య చేశాడనే అనుమానం బలపడుతుంది. దీనికి తోడు అమీ డైరీ ద్వారా వారి వివాహ జీవితంలోని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, నిక్ వివాహేతర సంబంధం వంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ నిక్ నేరానికి పాల్పడేలా చేశాయని అందరూ నమ్ముతారు.
Read Also : ముసలి వాళ్లనే టార్గెట్ చేసి చంపే సైకో… ట్విస్టులతో మైండ్ బ్లాకయ్యే మిస్టరీ థ్రిల్లర్
కథ మధ్యలో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యే ఒక నిజం బయటపడుతుంది. అమీ చనిపోలేదు, ఆమె తన భర్త నిక్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి, అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది. నిక్‌ను దోషిగా నిరూపించడానికి ఆధారాలను సృష్టిస్తుంది. ఆ తరువాత ఏమీ డబ్బుతో పారిపోయి, పాత ప్రేమికుడు డెసీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మోసపోయి అతన్ని మానిప్యులేట్ చేసి చంపేస్తుంది. ఆమె తన శరీరంపై గాయాలు సృష్టించి, ఒక కొత్త కిడ్నాప్ నాటకం ఆడి ఇంటికి తిరిగి వస్తుంది. నిక్ కు నిజం తెలిసినప్పటికీ, ఆమెను దోషిగా నిరూపించడానికి ఆధారాలు లేకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోతాడు. చివరకు అమీ గర్భవతినని చెప్పి అతనితో నే ఉండిపోతుంది. నిక్ సమాజంలో చెడ్డవాడు కాకూడదనే ఉద్దేశంతో ఆమెతోనే బలవంతంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఇలా ఈ కథలో ఓ అభాగ్యుడు బలి అవుతాడు.