E-Paper
Advertisement

OTT Movie : ముసలి వాళ్లనే టార్గెట్ చేసి చంపే సైకో… ట్విస్టులతో మైండ్ బ్లాకయ్యే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ముసలి వాళ్లనే టార్గెట్ చేసి చంపే సైకో… ట్విస్టులతో మైండ్ బ్లాకయ్యే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఈ రోజుల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల హవానే ఎక్కువగా ఉంది. ఏ భాషలో చూసుకున్నా ఇవే కథలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్లు అంతకు మించి అన్నట్లు ఉంటున్నాయి. ఇక వీటిలో సీరియల్ కిల్లర్స్ క్రైమ్ తో వచ్చే స్టోరీలు మరింత ఉత్కంఠతతో నడుస్తుంటాయి. ఇలాంటి కథతో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, ఊహించని మలుపులతో మతి పోగొడుతోంది. ఈ స్టోరీ పోప్ విజిట్ బ్యాక్‌డ్రాప్‌లో సీరియల్ మర్డర్స్ చూపిస్తుంది. ఇద్దరు డిటెక్టివ్ ల ఇవేసటిగేషన్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘మే గాడ్ సేవ్ అస్’ (May god save us) 2016లో విడుదలైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రోడ్రిగో సోరోగోయెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంటోనియో డి లా టోర్రే (ఇన్‌స్పెక్టర్ వెలార్డె), రోబర్టో ఆలామో (ఇన్‌స్పెక్టర్ అల్ఫారో), లూయిస్ జాహెరా (సీరియల్ కిల్లర్) లీడ్ రోల్స్ లో నటించారు. 2 గంటల 7 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.1/10 రేటింగ్ పొందింది. 2016 అక్టోబర్ 28న ఇది థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

2011 నాటి మాడ్రిడ్ నగరంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంటుంది. 15-M అనే ఉద్యమం (ప్రభుత్వ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు) జరుగుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో, పోప్ బెనెడిక్ట్ XVI సందర్శన కోసం లక్షలాది మంది యాత్రికులు నగరానికి వస్తారు. దీంతో నగరం మొత్తం గందరగోళంగా మారుతుంది. ఈ పరిస్థితుల మధ్య, వృద్ధ మహిళలపై దారుణంగా అఘాయిత్యాలు, హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ ఉదంతం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ కేసును పరిష్కరించే బాధ్యతను లూయిస్ వెలార్డే, జావియర్ అల్ఫారో అనే ఇద్దరు డిటెక్టివ్‌లు తీసుకుంటారు. వెలార్డే తెలివైనవాడైనప్పటికీ నత్తి సమస్యతో బాధపడుతుంటాడు. అల్ఫారో దూకుడు స్వభావం కలిగి ఉంటాడు.

Read Also : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్

పోలీసు ఉన్నతాధికారులు పోప్ పర్యటన కారణంగా ఈ కేసును గోప్యంగా ఉంచాలని ఒత్తిడి చేస్తారు. సమయం తక్కువగా ఉండటంతో, ఈ ఇద్దరు డిటెక్టివ్‌లు హంతకుడిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ తమలోని హింసాత్మక స్వభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హంతకుడిని వెంటాడుతున్న కొద్దీ, తమకు, ఆ కిల్లర్‌కు మధ్య పెద్దగా తేడా లేదని వాళ్ళు గ్రహిస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఊహించని మలుపులకు దారి తీస్తుంది. చివరికి వీళ్ళు హంతకులను పట్టుకుంటారా ? డిటెక్టివ్‌లు తమని తాము కిల్లర్స్ తో ఎందుకు పోల్చుకున్నారు ? అనే విషయాలను, ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×