E-Paper
Advertisement

OTT: ఓటీటీలో సరికొత్త సంచలనం.. ఇంకా పట్టాలెక్కని సినిమా హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!

OTT: ఓటీటీలో సరికొత్త సంచలనం.. ఇంకా పట్టాలెక్కని సినిమా హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!
Advertisement

OTT:సాధారణంగా ఒక సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకోవాలి అంటే ఆ సినిమా చూసిన తర్వాతనే.. కంటెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఫ్లాట్ ఫామ్ అయినా తీసుకోవడానికి ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక సినిమా మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ జరిగింది. షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ లీడింగ్ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి ఓటీటీ చరిత్రలో ఇదో సరికొత్త సంచలనం అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని సినిమా హక్కులను దక్కించుకొని నెట్ ఫ్లిక్స్ రికార్డ్ సృష్టించడం గమనార్హం.

సినిమా ప్రారంభం కాకముందే అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్..

ఏగన్, ఫెమినా జార్జ్, కోర్ట్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి అప్పల్ల (Sridevi Appalla) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హైకూ.. యువరాజు చినస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు కేరళలోని ఇడుక్కిలో ప్రారంభం అయింది. షూటింగ్ దశలోనే ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషం. సినిమా కంటెంట్ చూసిన తర్వాతే ఈ ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి అలాంటిది షూటింగ్ మొదలైన రోజునే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోవడంతో ఇప్పుడు అందరూ హైకూ చిత్రం పై దృష్టి సారిస్తున్నారు. అంతలా ఈ సినిమాలో ఏం ఉండబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. మొత్తానికైతే ఈ ఒక్క సినిమా ఇప్పుడు సినిమా ప్రియులలో అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

Advertisement

also read:This week theatre release: ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు ఇవే!

హైకూ సినిమా విశేషాలు..

హైకూ సినిమా విషయానికి వస్తే.. విజయ్ సినిమా హౌస్ పతాకం పై డి. అరుళనంద, మాథ్యూ అరుళనంద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . వినూత్న కథాంశంతో.. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవతరం ప్రేమ కథ ఇది అని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే సినిమాను చూడకుండానే ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకోవడంతో దర్శకుడు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తూ ఉండగా.. ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×