E-Paper
Advertisement

Gandhi Talks: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ సినిమాలో తెలుగుకు అవమానం.. ఏం జరిగిందంటే?

Gandhi Talks: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ సినిమాలో తెలుగుకు అవమానం.. ఏం జరిగిందంటే?
Advertisement

Gandhi Talks: ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా కాలం తర్వాత వచ్చిన ఒక మూకీ (Silent) సినిమా గాంధీ టాక్స్. మాటలు లేకపోయినా, కేవలం హావభావాలు సంగీతం ద్వారా కథను నడిపించడం ఈ సినిమా ప్రత్యేకత. అయితే విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రోపర్ తెలుగు సినిమా అని చెంప్పేందుకు నిర్మాతలు చేసిన పని వారిని నవ్వుల పాలు చేస్తోంది. ఎందుకంటే.. ఆ సినిమాలో తెలుగు మాటలు లేకపోయినా.. టైటిల్ కార్డ్స్ మాత్రం తెలుగులో వేశారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఆ టైటిల్ కార్డ్స్ అనవదించినపుడు వాటిని సరిగా చూసుకోలేదు. కొన్ని పదాల్లో ఒత్తులు పొల్లులు ఎగిరిపోయాయి. కొన్ని పేర్లు కూడా మారిపోయాయి. దీనిని చూసిన నెటిజన్లు మండి పడుతున్నారు. అసలు తెలుగులో ఎందుకు వేశారు, ఎవరైనా అడిగారా.. ఇలా సగం సగం వేసి తెలుగును అవమానించడం ఎందుకు అని నెటిజన్లు మూవీ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై మూవీ టీం మాత్రం స్పందించలేదు. ఏం జరుగుద్దో చూడాలి మరి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కిషోర్ పాండురంగ బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. జనవరి 30, 2026 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.

Read also-Varun Tej : అల్లు అర్జున్ డైరెక్టర్ తో వరుణ్ కొత్త మూవీ.. మెగా హీరో దశ తిరగడం ఖాయం..!

కథా సారాంశం

Advertisement

ఈ సినిమా డబ్బు (Money) మరియు నైతికత (Morality) చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా నేటి సమాజంలో “డబ్బు ఎలా మాట్లాడుతుంది అనే అంశాన్ని వ్యంగ్యంగా, భావోద్వేగంగా చూపించారు. ముంబైలో నివసించే ఒక నిరుద్యోగి. తన తల్లి అనారోగ్యం, ప్రేమించిన అమ్మాయి (అదితి రావు హైదరీ) కోసం డబ్బు సంపాదించాలని కష్టపడుతుంటాడు. ఒక కోటీశ్వరుడు. అన్నీ ఉన్నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కుప్పకూలిపోయి ఉంటాడు. వీరిద్దరి జీవితాలు ఒక దొంగతనం నేపథ్యంలో ఎలా కలిశాయి? గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోటు వీరి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.

Read also-Brahmamudi Serial Today February 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బిడ్డ కోసం మినిస్టర్ ఇంటికి వెళ్లిన రాజ్, కావ్య 

సినిమా ప్రత్యేకతలు

Advertisement

ఇది ఒక మూకీ సినిమా కావడంతో, నటీనటుల పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. విజయ్ సేతుపతి తన కళ్లతోనే భావాలను పలికించగా, అరవింద్ స్వామి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏ.ఆర్. రెహమాన్ మాటలు లేని లోటును రెహమాన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో భర్తీ చేశారు. సన్నివేశానికి తగ్గట్లుగా సంగీతం ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తుంది. గాంధీజీ ఆశయాలకు, నేటి కాలంలో మనం వాడుతున్న గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దర్శకుడు ప్రతీకాత్మకంగా చూపించారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×