E-Paper
Advertisement

Heist Thriller OTT : బ్యాంక్ సేఫ్ ను బద్దలు కొట్టడానికి మైండ్ బెండింగ్ ప్లాన్… వీడి ధైర్యానికి దండం పెట్టాలి భయ్యా

Heist Thriller OTT : బ్యాంక్ సేఫ్ ను బద్దలు కొట్టడానికి మైండ్ బెండింగ్ ప్లాన్… వీడి ధైర్యానికి దండం పెట్టాలి భయ్యా
Advertisement

Heist Thriller OTT : సినిమాలలో హీస్ట్ థ్రిల్లర్ సినిమాలిచ్చే కిక్కే వేరప్పా. వాళ్ళ ప్లానింగూ, పోలీసులను బురిడీ కొట్టించే తీరు, ఎస్కేపింగ్ స్కిల్సూ… ఒక్కటేమిటి సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులతో సహ అన్నీ ఆసక్తికరమే. ఇక స్టోరీ పక్కాగా ఉండాలే గానీ అదిచ్చే థ్రిల్, సాటిస్ఫ్యాక్షన్ కు డైరెక్టర్ కు దండం పెట్టాలన్పిస్తుంది. మీది కూడా అచ్చం ఇదే ఫీలింగ్ అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ సినిమా పేరేంటి ? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

హీస్ట్ మూవీస్ ఇష్టపడేవాళ్ల కోసమే ఈ క్లాసిక్ థ్రిల్లర్ ‘ది బ్యాంక్ జాబ్’ (The Bank Job). 2008లో వచ్చిన ఈ మూవీకి రోజర్ డొనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ 1971లో జరిగిన రియల్ బేకర్ స్ట్రీట్ బ్యాంక్ రాబరీ ప్రేరణతో తెరకెక్కింది. జాసన్ స్టాధమ్, సాఫ్రాన్ బరోస్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, కరప్షన్, బ్లాక్‌మెయిల్ వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. అప్పట్లో థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. 1971 బేకర్ స్ట్రీట్ రాబరీలో రాయల్ ఫ్యామిలీ కుంభకోణం, MI5 ఇన్వాల్వ్‌మెంట్ రూమర్స్ వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఈ మూవీలో చూడవచ్చు.

Advertisement

Read Also : ఓటీటీలోకి ధర్మేంద్ర చివరి చిత్రం… ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే ?

స్టోరీలోకి వెళ్తే…

1971 లండన్‌ లో జరుగుతుంది కథ. టెర్రీ లెదర్ (జాసన్ స్టాధమ్) కార్ డీలర్ గా పని చేస్తాడు. అతనికి భార్య, పిల్లలు ఉంటారు. గతంలో అతనికి క్రిమినల్ రికార్డు ఉండగా, ప్రస్తుతం ఫ్యామిలీతో సాధారణ జీవితం గడుపుతాడు. ఈ నేపథ్యంలోనే మార్టిన్ లవ్ (సాఫ్రాన్ బరోస్) అనే మోడల్ ఇతన్ని కలుస్తుంది. బేకర్ స్ట్రీట్ లాయిడ్స్ బ్యాంక్ వాల్ట్ ను బ్రేక్ చేసి రాబరీ చేయాలని అడుగుతుంది. అనివార్య కారణాలతో అలారం ఆఫ్ అవ్వడంతో ఈ రాబరీ చేయడానికి కొన్ని వీక్స్ టైమ్ ఉంటుంది. టన్నెల్ తొవ్వితే వాల్ట్‌ లోకి ఈజిగా ఎంటర్ అవ్వొచ్చు అన్నది ప్లాన్. హీరో కూడా ఆ దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు.

Advertisement

హీరో టెర్రీ ఈ దొంగతనాన్ని ఒంటరిగా చేయకుండా తన పాత ఫ్రెండ్స్ ను కూడా రప్పిస్తాడు. అనుకున్నట్టుగానే దొంగతనం చేస్తారు. బ్యాంక్ వాల్ట్ ను పగలగొట్టి, అందులో ఉన్న క్యాష్, బంగారాన్ని, డాక్యుమెంట్స్ ను కొల్లగొడతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ సేఫ్ లోని డాక్యుమెంట్స్ లో రాయల్ ఫ్యామిలీకి సంబందించిన టాప్ సీక్రెట్స్, క్రైమ్ కు సంబంధించిన హై ప్రొఫైల్ సీక్రెట్స్ వంటి సీక్రెట్స్ ఉంటాయి. ఆ తరువాత మొదలవుతుంది అసలు కథ. రంగంలోకి దిగిన ఎంఐ5 ఏజెంట్స్ టెర్రీ టీంను పట్టుకున్నారా ? ఈ దొంగలు ఆ వాల్ట్ రాబరీ వల్ల ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×