E-Paper
Advertisement

ఈ ఏడాది ఇప్పటిదాకా ఓటీటీలో విడుదలైన తమిళ హిట్స్… ఇందులో మీరెన్ని చూశారు ?

ఈ ఏడాది ఇప్పటిదాకా ఓటీటీలో విడుదలైన తమిళ హిట్స్… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Best Tamil Movies 2026: 2026 సంవత్సరం తమిళ సినిమా ప్రేమికులకు గోల్డెన్ ఇయర్ గా నిలిచింది. కోవిడ్ తర్వాత దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్‌ ను ఏకపక్షంగా శాసించాయి. ఇంకా ఈ ఏడాది సగం కూడా పూర్తి కాకముందే థియేటర్లలో విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధించి, OTTలో కూడా ట్రెండింగ్‌ లో నిలిచిన కొన్ని టాప్ తమిళ చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం పదండి.

1. Blast (బ్లాస్ట్)

అర్జున్ సర్జా నటించిన యాక్షన్ డ్రామా ‘Blast’. IMDbలో మంచి రేటింగ్ సాధించిన ఉత్తమ తమిళ చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 75.11 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం 18 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 192% లాభాలను గడించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాను Netflixలో చూడవచ్చు.

2. Karuppu (కరుప్పు)

Advertisement

సూర్య, త్రిష కృష్ణన్ కలిసి నటించిన యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 309.98 కోట్లు వసూలు చేసింది. కేవలం రూ. 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 138.45% లాభాలను సాధించింది. ఈ సినిమాను కూడా నెట్ ఫ్లిక్స్ లోనే వీక్షించవచ్చు.

3. Youth (యూత్)

2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో Youth కూడా ఒకటి. ప్రపంచవ్యాప్త ఈ సినిమా రూ. 71.73 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దాదాపు 200% లాభాలను నిర్మాతలకు గడించి పెట్టింది. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే అందుబాటులో ఉంది.

4. Thai Kilavi (తై కిళవి)

Advertisement

తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కి అద్భుతమైన విజయం సాధించిన మరో తమిళ చిత్రం ‘తై కిళవి’. ప్రపంచవ్యాప్తంగా రూ.82.02 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఈ మూవీ బడ్జెట్ కేవలం 9 నుంచి 10 కోట్లు కావడం విశేషం. ఇందులో రాధిక పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. వృద్ధురాలిగా ఆవిడ అద్భుతంగా నటించింది. ఈ సినిమాను JioHotstarలో చూడవచ్చు.

5. Kaara (కర)

తమిళ స్టార్ ధనుష్ భారీ బడ్జెట్ చిత్రం ‘కర’. థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ, OTTలో భారీ విజయం సాధించింది ఈ మూవీ. వైవిధ్యభరిత నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘కర’ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకోవడంతో థియేట్రికల్ రన్‌ను ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లతో ముగించింది. అయితే ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 110 కోట్లు. కానీ అందులో సగమే రాబట్టింది.

6. Parasakthi (పరాశక్తి)

2026లో అత్యధిక వసూళ్లు సాధించిన పొలిటికల్ డ్రామా చిత్రం ‘పరాశక్తి’. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాను ZEE5లో చూడవచ్చు.

7. Love Insurance Company (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి మరియు ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రోమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. నయనతార నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 90 కోట్ల నుండి రూ. 95 కోట్ల భారీ బడ్జెట్‌ తో రూపొందింది. బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వడానికి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ. 66 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఓటీటీలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను Amazon Prime Videoలో చూడవచ్చు.

Read Also: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వెనకున్న బాగోతం బట్టబయలు చేసిన సిరీస్… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపరు

Tags

Related News

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

రూ. 1185 కోట్ల కలెక్షన్స్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న రాబిన్ హుడ్ చివరి కథ

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా

అమ్మకు క్యాన్సర్… కూతురికి ఆటిజం… కానీ ఈ అమ్మాయి చేసిన పని చూస్తే గర్వపడతారు భయ్యా

Big Stories

Advertisement
×