E-Paper
Advertisement

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వెనకున్న బాగోతం బట్టబయలు చేసిన సిరీస్… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపరు

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వెనకున్న బాగోతం బట్టబయలు చేసిన సిరీస్… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపరు
Advertisement

Crime Thriller Series: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకులు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అసలు ఇలాంటి దారుణాలు ఎలా జరుగుతాయి ? అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సిరీస్ ‘ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్’ (Exam: The System Exposed – Season 1). 2026 మే నెలలో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఈ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ప్రస్తుత విద్యావ్యవస్థలో జరుగుతున్న పోటీ పరీక్షల అక్రమాల నేపథ్యంలో సాగుతుంది ఈ సిరీస్. కథ ఊటీలోని ఒక హిల్ టౌన్ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. కొత్తగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బదిలీ అయ్యి అక్కడికి వస్తుంది మరమల్లి (అదితీ బాలన్) అనే మహిళా అధికారిని. ఆమెను ఝాన్సీ అనే ఒక మామూలు అమ్మాయి కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత నిజమైన మరమల్లిని ఒక రహస్య స్థావరంలో బంధిస్తుంది. ఝాన్సీ తానే డిఎస్పీ మరమల్లిగా నకిలీ ఐడెంటిటీతో పోలీస్ స్టేషన్‌ లో బాధ్యతలు స్వీకరిస్తుంది.

Advertisement

ఝాన్సీ కేవలం యూనిఫామ్ వేసుకోవడానికి ఈ సాహసం చేసింది అనుకుంటే పొరపాటే. రీజినల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ (RPSE) / సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్న భారీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మాఫియాను అంతం చేయడానికి ఆమె ఈ ప్లాన్ ను అమలు చేస్తుంది. ఈ వ్యవస్థాగత అవినీతి వల్ల నష్టపోయిన మాజీ జైలర్ జయచంద్రన్, ఒక చిన్న టీమ్ ఆమెకు వెనుక ఉండి సహాయం చేస్తుంటారు. ఈ సిరీస్‌లో కరడుగట్టిన నెట్‌వర్క్ ఎలా పని చేస్తుందో బాగా చూపించారు.

కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు, మధ్యవర్తులు, రాజకీయ పలుకుబడి ఉన్న సంపన్నులు ఒక సిండికేట్‌గా ఏర్పడతారు. వీరు పేద, మధ్యతరగతికి చెందిన అర్హులైన విద్యార్థుల సీట్లను దొడ్డిదారిన కోట్ల రూపాయలు వసూలు చేసి ధనవంతుల పిల్లలకు అమ్ముతారు. ఓ వైపు ఝాన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, మరోవైపు కుమారేశన్ అనే ఒక పేద మత్స్యకార కుటుంబానికి చెందిన టాలెంటెడ్ విద్యార్థి కథ యాడ్ అవుతుంది. కష్టపడి చదివినా ఈ వ్యవస్థాగత వైఫల్యం, స్కామ్ ల వల్ల అతని జీవితం, భవిష్యత్తు ఎలా నాశనమయ్యాయనేది ఈ సిరీస్ లో చూస్తే కన్నీళ్ళు ఆగవు.

Advertisement

ప్రస్తుత దేశవ్యాప్త NEET / UPSC వంటి ఎగ్జామ్స్ లీకేజ్ పరిస్థితులకు అద్దం పడుతుంది ఈ సిరీస్. డీఎస్పీ వేషంలో ఉన్న ఝాన్సీని పోలీసులు పసిగట్టారా లేదా ? బందీగా ఉన్న నిజమైన మరమల్లి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి ? చివరకు అత్యున్నత స్థాయి అధికార పీఠాల్లో ఉన్న అసలైన లీకేజ్ మాఫియా కింగ్ పిన్స్‌ను ఝాన్సీ ఏం చేసింది ? వాళ్ళను ఎలాంటి ఆధారాలతో సమాజం ముందు నిలబెట్టింది ? అనే ఉత్కంఠభరితమైన ట్విస్టులతో సీజన్ పూర్తవుతుంది.

ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది ఈ సిరీస్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలలొ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉండగా, ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు ఉంటుంది. IMDbలో రేటింగ్ 8.4 ఉన్న ఈ సిరీస్ మే 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ కు జాతీయ అవార్డు గ్రహీత ఎ. సర్గుణం దర్శకత్వం వహించగా, ప్రసిద్ధ దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

Read Also : హైటెక్ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో అరాచకం… మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్…

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×