E-Paper
Advertisement

పాతికేళ్లయినా దొరకని భర్త ఆచూకీ… నియంత పాలనలో నలిగిపోయిన జీవితం… గుండెల్ని పిండేసే రియల్ స్టోరీ

పాతికేళ్లయినా దొరకని భర్త ఆచూకీ… నియంత పాలనలో నలిగిపోయిన జీవితం… గుండెల్ని పిండేసే రియల్ స్టోరీ
Advertisement

Historical drama OTT : రియల్ స్టోరీల ఆధారంగా వస్తున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా ఆస్కార్ ను కూడా గెలిచి అబ్బురపరిచింది. 1971లో బ్రెజిల్ మిలిటరీ పాలనలో అదృశ్యమైన ఒక మాజీ ఎంపీ చుట్టూ అసలు కథ ఉంటుంది. అతని భార్య తన భర్త ఏమయ్యాడో తెలుసుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూనే, మరోపక్క చదువుకుని లాయర్‌ కూడా అయ్యారు. క్లైమాక్స్ వరకు ఇది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇది ఒక సినిమా స్టోరీనే కాదు, ఒక మహిళ పోరాటాన్ని చాలా ఇన్స్పిరేషన్ గా చూపిస్తుంది. దీనికి ఐయండిబిలో ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2024లో వచ్చిన ఈ బ్రెజిలియన్ బయోపిక్ సినిమా పేరు ‘ఐ యామ్ స్టిల్ హియర్’ (I’m Still Here). ఈ సినిమా 2024లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, అక్కడ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకోవడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 97వ అకాడమీ అవార్డ్స్‌లో (2025) బ్రెజిల్ దేశానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మొదటి ఆస్కార్‌ను తెచ్చిపెట్టి చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత దర్శకుడు వాల్టర్ సాలెస్ దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తీసిన ఈ సినిమా, బ్రెజిల్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక నటన విషయానికి వస్తే, ప్రధాన పాత్ర పోషించిన ఫెర్నాండా టోర్రెస్ తన అద్భుత నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. విశేషమేమిటంటే సినిమాలో వృద్ధాప్యంలో ఉన్న హీరోయిన్ పాత్రను ఆమె రియల్ తల్లి, లెజెండరీ నటి ఫెర్నాండా మోంటెనెగ్రో పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Netflix ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బ్రెజిల్‌లో 1971వ సంవత్సరంలో రూబెన్స్ పైవా అనే ఒక మాజీ ఎంపీ తన భార్య యూనిస్, ఐదుగురు పిల్లలతో కలిసి చాలా సరదాగా, హ్యాపీగా గడుపుతుంటాడు. అప్పట్లో అక్కడ మిలిటరీ పాలన నడుస్తుంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా పోలీసులు వచ్చి రూబెన్స్‌ను కొంచెం విచారణ ఉంది, మాతో రావాలని తీసుకెళ్తారు. అలా వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాడు. అసలు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమయ్యారు? అనేది ఎవరికీ తెలియదు. ఇక భర్త కనిపించకుండా పోవడంతో యూనిస్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అయినాకూడా తన ఐదుగురు పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూనే, తన భర్త ఏమయ్యాడో తెలుసుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం మొదలుపెడుతుంది.

మిలిటరీ వాళ్లు ఆమెను కూడా జైల్లో పెట్టి హింసిస్తారు, కానీ ఆమె భయపడదు. ఒకటా రెండా.. దాదాపు 40 ఏళ్ల పాటు ఆమె పోరాటం సాగుతుంది. చివరికి తన భర్తను మిలిటరీ వాళ్లే చంపేశారని ప్రభుత్వం ఒప్పుకునేలా చేస్తుంది. అప్పటివరకు కేవలం గృహిణిగా ఉన్న యూనిస్, చదువుకుని లాయర్‌గా మారి మరీ ఈ యుద్ధం చేస్తుంది. చివరికి 2014లో బ్రెజిల్ ప్రభుత్వ ‘ట్రూత్ కమిషన్’ అధికారికంగా రూబెన్స్ పైవాను మిలిటరీ వాళ్లే హత్య చేశారని నిర్ధారించింది. అలా దశాబ్దాల పాటు ఆమె సాగించిన పోరాటం ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇక ఒక ఆడది తలుచుకుంటే ఎంతటి నియంత ప్రభుత్వన్నైనా గడగడలాడించగలదని ఈ సినిమా మనకు చూపిస్తుంది.

Advertisement

Read Also : చిన్నపిల్లల చేతిలో గన్నులు.. దేవుడు కూడా చూడలేని దారుణాలు… ఐయండిబిలో 8.6 రేటింగ్

Related News

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

Big Stories

Advertisement
×