E-Paper
Advertisement

చిన్నపిల్లల చేతిలో గన్నులు.. దేవుడు కూడా చూడలేని దారుణాలు… ఐయండిబిలో 8.6 రేటింగ్

చిన్నపిల్లల చేతిలో గన్నులు.. దేవుడు కూడా చూడలేని దారుణాలు… ఐయండిబిలో 8.6 రేటింగ్
Advertisement

Crime Thriller OTT : ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ‘సిటీ ఆఫ్ గాడ్’ (City of God). ఈ బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. బ్రెజిల్‌లోని రియోడి జనీరో నగరంలో ఉన్న ‘సిటీ ఆఫ్ గాడ్’ అనే మురికివాడ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 1960ల నుండి 1980ల వరకు అక్కడ నేరాలు, డ్రగ్స్ మాఫియా ఎలా పెరిగాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇక ఈ సినిమాలో నటించిన వారిలో చాలామంది నిజమైన మురికివాడల నుండి వచ్చినవారే, ప్రొఫెషనల్ నటులు కాదు. దీని వల్ల సినిమా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అయితే ఆ మురికివాడల్లో షూటింగ్ చేయడం అంత ఈజీ కాలేదు. నిజమైన గ్యాంగ్‌స్టర్ల పర్మిషన్ తీసుకుని, వాళ్లకు కొంత డబ్బు కట్టి మరీ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఒకానొక దశలో షూటింగ్ మధ్యలో గొడవలు జరిగి యూనిట్ మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు కూడా.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్  

2002లో వచ్చిన ఈ బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా ‘సిటీ ఆఫ్ గాడ్’ (City of God) ను ఫెర్నాండో మెయిరెల్స్ డైరెక్ట్ చేశారు. సినిమాలో మనం చూసే క్రూరమైన ‘లిటిల్ జే’ పాత్ర నిజంగా బ్రెజిల్‌లో ఉన్న జో పెక్వెనో అనే గ్యాంగ్‌స్టర్ ఆధారంగా రూపొందింది. అతను నిజంగానే 18 ఏళ్ల వయసుకే ఆ మురికివాడలో పెద్ద డాన్ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఎడిటింగ్, కెమెరా వర్క్ చాలా కొత్తగా ఉంటుంది. ‘షాకీ కెమెరా’ వాడటం వల్ల మనం కూడా ఆ రౌడీల మధ్యలోనే ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి బెస్ట్ సినిమాటోగ్రఫీలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఇది 250 టాప్ సినిమాల లిస్టులో 25వ స్థానం సంపాదించుకుందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్, గూగుల్ టీవీలో రెంటుకు తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బ్రెజిల్‌లోని రియో అనే ఊరి పక్కన ఉన్న ఒక పెద్ద మురికివాడ ఉంటుంది. పేరుకేమో ‘సిటీ ఆఫ్ గాడ్’ కానీ, అక్కడ అంతా దెయ్యాల రాజ్యమే. 1960ల కాలంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసే కుర్రాళ్లు ఉండేవారు. అక్కడ పేదరికం వల్ల చిన్న పిల్లలు కూడా దొంగతనాలు, నేరాల వైపు మళ్లుతుంటారు. ఆ సమయంలో ‘లిటిల్ డైస్’ అనే కుర్రాడు తనలోని క్రూరత్వంతో అందరినీ భయపెట్టి, ఆ ఏరియాలో తనే పెద్ద రౌడీ కావాలని కలలు కంటాడు. కొన్నేళ్ల తర్వాత, ఆ కుర్రాడు ‘లిటిల్ జే’గా మారి ఆ మురికివాడను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటాడు.

ఈ క్రమంలో రెండు గ్యాంగ్‌ల మధ్య పెద్ద యుద్ధం మొదలవుతుంది. అమాయకులు కూడా ఆ గ్యాంగ్ వార్‌లో బలవుతుంటారు. ఆ వాతావరణంలో బ్రతకడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడమే అన్నట్లుగా ఉంటుంది. అదే మురికివాడలో పెరిగిన రాకెట్ అనే అబ్బాయికి మాత్రం నేరాల మీద ఆసక్తి ఉండదు. అతను ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటాడు. అక్కడ జరిగే గ్యాంగ్ వార్‌లను, లిటిల్ జే చేసే అరాచకాలను తన కెమెరాలో బంధిస్తాడు. చివరికి ఆ గ్యాంగ్ వార్ ఎలా ముగిసింది ? రాకెట్ తన టాలెంట్‌తో ఆ మురికివాడ నుండి బయటపడి ఎలా సక్సెస్ అయ్యాడు ? అనేదే ఈ సినిమా ముగింపు.

Advertisement

Read Also : తండ్రుల ఇగోలు కొడుకుల గోలలు కలిపి కొట్టిన పక్కా రౌడీ స్టోరీ… ఐయండిబిలో 8.4 రేటింగ్

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×