Hollywood Best Movies on OTT : 90s కాలం సినిమా ప్రపంచానికి ఒక స్వర్ణయుగం. అప్పట్లో విడుదలైన కొన్ని హాలీవుడ్ సినిమాలు వినోదాన్ని మాత్రమే కాకుండా, ప్రేక్షకుడి ఆలోచనా విధానాన్ని కూడా మార్చేశాయి. ఇప్పుడు చెప్పుకోబోయే 10 సినిమాలు సంవత్సరానికి ఒకటి చొప్పున వచ్చి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా నేటికీ ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. అంతేకాదు ఈ సినిమాలు చూస్తున్నప్పుడు మీ మెదడుకు కూడా పదును పెట్టాల్సి ఉంటుంది. ప్రతి సీన్ చాలా జాగ్రత్తగా గమనిస్తేనే ఇందులోని మలుపులు అర్థమవుతాయి. వీకెండ్‌లో మంచి థ్రిల్లింగ్ అనుభూతి కావాలంటే ఈ లిస్ట్ కంప్లీట్ చేసేయండి.
ఇది ఒక సైకలాజికల్ హర్రర్ మాస్టర్‌పీస్. వియత్నాం యుద్ధం నుండి తిరిగి వచ్చిన ఒక సైనికుడికి భయంకరమైన దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అవి అసలు నిజమా లేక తన భ్రమలా అనేదే ఈ సినిమా. దీని క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు. Amazon Prime Video ఇది అందుబాటులో ఉంది.
ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ ఏజెంట్, మరో ప్రమాదకరమైన నేరస్తుడు డాక్టర్ హన్నిబాల్ లెక్టార్ సహాయం తీసుకోవడం ఈ సినిమా కథ. ఇందులో ఆంథోనీ హాప్కిన్స్ నటన మిమ్మల్ని భయపెడుతుంది. Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.
ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా మొదలై, ఊహించని మలుపులతో ముగుస్తుంది. సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. Apple TV దీనిని చూడవచ్చు.
హారిసన్ ఫోర్డ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, భార్యను చంపని నేరానికి శిక్ష పడిన ఒక డాక్టర్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చేసే పోరాటం. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే దీని ప్రత్యేకత. Amazon Prime Video, Apple TVలో ఇది అందుబాటులో ఉంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ చిత్రం, జైలు జీవితం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక గొప్ప జీవిత పాఠం కూడా. Netflix, Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.
‘కీజర్ సోజే’ఎవరు? అనే ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరిగే ఈ సినిమా క్లైమాక్స్ సినిమా చరిత్రలోనే గొప్ప ట్విస్ట్‌లలో ఒకటి.
Amazon Prime Videoలో దీనిని చూడచ్చు.
ఎడ్వర్డ్ నార్టన్ పరిచయమైన ఈ చిత్రం ఒక కోర్ట్ డ్రామా. ఒక హత్య కేసులో పట్టుబడిన అబ్బాయి అమాయకుడా కాదా అనే పాయింట్ మీద సాగే ఈ సినిమా ముగింపు అదిరిపోతుంది. Amazon Prime Video, Apple TVలో ఇది అందుబాటులో ఉంది.
డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఒక పుట్టినరోజు కానుకగా తన సోదరుడు ఇచ్చే ఒక వింతైన ఆట గురించి. ఆ ఆటలో ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాక హీరోతో పాటు ప్రేక్షకులు కూడా అయోమయంలో పడతారు. Amazon Prime Video, Apple TVలో దీనిని చూడచ్చు.
ఒక వ్యక్తి జీవితం మొత్తం ప్రపంచం చూస్తున్న ఒక టీవీ షో అని అతనికి తెలిస్తే? జిమ్ క్యారీ నటించిన ఈ సినిమా మన సోషల్ మీడియా కాలానికి ఎప్పుడో అద్దం పట్టింది. Amazon Prime Video, Paramount+లో దీనిని చూడచ్చు.
90వ దశకాన్ని ఒక క్లాసిక్ ఎండింగ్‌తో ముగించిన సినిమా ఇది. సమాజంపై తిరుగుబాటు వంటి అంశాలతో సాగే ఈ సినిమా నేటి యువతకు కూడా ఫేవరెట్. Amazon Prime Video, Apple TVలో ఇది అందుబాటులో ఉంది.
Read Also : తప్పకుండా చూడాల్సిన ఇండియన్ థ్రిల్లర్ సినిమాలు… ఇవి ఇచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాక్