E-Paper
Advertisement

తప్పకుండా చూడాల్సిన ఇండియన్ థ్రిల్లర్ సినిమాలు… ఇవి ఇచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాక్

తప్పకుండా చూడాల్సిన ఇండియన్ థ్రిల్లర్ సినిమాలు… ఇవి ఇచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాక్

Thriller Movies on OTT : ఊహించని మలుపులు, సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ ఉంటే ఆ కిక్కే వేరు. అలాంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్ళ కోసం, మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో వచ్చిన అద్భుతమైన ఇండియన్ థ్రిల్లర్ సినిమాలపై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.

1. దృశ్యం (Drishyam)

థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే మొదట గుర్తొచ్చే పేరు ‘దృశ్యం’. ఒక మామూలు కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థనే ఎలా బురిడీ కొట్టించాడనేది ఈ సినిమా కథ. ఇందులో ప్రతి సీన్ ఒక పజిల్ లా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడవచ్చు. 2013లో వచ్చిన ఈ మలయాళం సినిమా తెలుగు, హిందీలో రీమేక్ అవ్వడంతో పాటు, బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టింది.

2. రాక్షసన్ (Ratsasan)

సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక మాస్టర్ పీస్. స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి చంపే ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నమే ఈ సినిమా. కిల్లర్ ఎవరనే సస్పెన్స్ చివరి వరకు మెయింటైన్ చేస్తూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మనల్ని చంపినంత పని చేస్తుంది ఈ సినిమా. జియో హాట్‌స్టార్లో ఈ సినిమాను చూడవచ్చు. తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో ఇది అందుబాటులో ఉంది).

3. బద్లా (Badla)

అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక రూమ్ లో జరిగే ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఒక హత్య కేసులో ఇరుక్కున్న తాప్సీని కాపాడడానికి వచ్చే లాయర్ అమితాబ్ మధ్య జరిగే సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ మీరు అస్సలు ఊహించలేరు. నెట్‌ఫ్లిక్స్ లో ఇది అందుబాటులో ఉంది.

4. సెక్టార్ 36 (Sector 36)

రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై సంచలనం సృష్టించింది. ఒక సీరియల్ కిల్లర్, ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే మైండ్ గేమ్ ఇది. విక్రాంత్ మాస్సే నటన ఈ సినిమాకు హైలైట్.

5. జోసెఫ్ (Joseph)

ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఒక పెద్ద మెడికల్ మాఫియాను ఎలా బయటపెట్టాడనేదే ఈ సినిమా కథ. మలయాళ సినిమాల్లో ఉండే రియాలిటీ, ఎమోషన్, థ్రిల్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ మలయాళం మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

6. మర్దానీ (Mardaani)

రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగుతుంది. విలన్, హీరోయిన్ మధ్య జరిగే ఫోన్ కాల్స్, మైండ్ గేమ్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో ట్విస్టులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది వచ్చిన పార్ట్ 3 కి కూడా మంచి స్పందన వస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో దీనిని చూడవచ్చు.

7. రాత్ అకేలీ హై (Raat Akeli Hai)

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక క్లాసిక్ మర్డర్ మిస్టరీ. ఒక రిచ్ పర్సన్ హత్య కేసును ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కు ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరూ అనుమానితులుగానే కనిపిస్తారు. పాతకాలపు డిటెక్టివ్ నవల చదివిన అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాని మనం చూడవచ్చు.

Read Also : బుర్ర హీటెక్కించే థ్రిల్లర్ సినిమాలు… వీటి క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×