E-Paper
Advertisement

V2V Technology on Cars: ఇక నో రోడ్ యాక్సిడెంట్స్ .. కార్లు మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేస్తోంది!

V2V Technology on Cars: ఇక నో రోడ్ యాక్సిడెంట్స్ .. కార్లు మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేస్తోంది!
Advertisement

ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేలా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. V2V సేఫ్టీ టెక్నాలజీతో రోడ్డు భద్రతను మెరుగు పరచాలని భావిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అన్ని రాష్ట్రాల రవాణా మంత్రులు, సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఇకపై అన్ని కార్లలో V2V కమ్యూనికేషన్ వ్యవస్థ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) త్వరలో అన్ని కొత్త కార్లలో వెహికిల్ టు వెహికిల్(V2V) కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయనుంది. ఇది రహదారి భద్రతను పెంచడంతో పాటు   ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ కార్ల మధ్య వైర్‌ లెస్ డేటా ట్రాన్స్ ఫర్ కోసం ఆన్ బోర్డ్ యూనిట్లను వాహనాల్లో అమర్చుతాయి. ఇందులో ఎదరుగా వచ్చి ఢీకొనడం,  బ్లైండ్ స్పాట్ ప్రమాదాలు, ఎమర్జెన్సీ బ్రేకింగ్   గురించి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి వీలు కల్పిస్తాయి. V2V కమ్యూనికేషన్‌కు సపోర్ట్ ఇచ్చేలా 30 MHz స్పెక్ట్రమ్ కేటాయింపునకు టెలికమ్యూనికేషన్ల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం  తెలిపినట్లు మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.  “ఈ వ్యవస్థ డ్రైవర్లను ముందస్తుగా హెచ్చరించడం, బ్లైండ్ స్పాట్ ప్రాంతాలలో వాహనాలను గుర్తించడం ద్వారా ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి” అని గడ్కరీ తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలనే లక్ష్యంగా భాగంగాఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేలా!

Advertisement

కేంద్ర రోడ్డు రవాణా శాఖ డేటా ప్రకారం. దేశం 2023లో 500,000 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో  180,000 కంటే ఎక్కువ మంది మరణించారు. అటు  రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ స్కీమ్, హిట్ అండ్ రన్ బాధితులకు మెరుగైన పరిహారం, మోటార్ వెహికిల్స్ చట్టం, జీరో ఫాటాలిటీ జిల్లాల కార్యక్రమంతో సహా రహదారి భద్రత, ప్రయాణికుల అనుభవాన్ని ప్రభావితం చేసే పలు అంశాలను రవాణా మంత్రులు సమావేశంలో చర్చించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో  మోటారు వాహనాల చట్టానికి ప్రతిపాదిత సవరణలు, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడం, నియంత్రణ చట్రాలను బలోపేతం చేయడం,  ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మొబిలిటీ, కాలుష్య  నిబంధనలను మార్చే అంశంపై దృష్టిసారించనున్నట్లు గడ్కరీ తెలిపారు.

బస్సు ప్రమాదాలను తగ్గింపు పైనా కీలక నిర్ణయం

ఇటీవల దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలను నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. స్లీపర్ కోచ్ బస్సులను ఇకపై ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే తయారు చేస్తాయన్నారు. ఇప్పటికే ఉన్న బస్సులలో అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తు ఇండికేటర్స్ ను అమర్చనున్నట్లు తెలిపారు.

Advertisement

Read Also: ఎమర్జెన్సీ టైమ్ లో ఈవీ నుంచి బ్యాటరీ ఎజెక్ట్, ఇక ఆ భయం తప్పినట్టే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×