E-Paper
Advertisement

Horror Comedy OTT: ఫ్యాక్టరీలో లొల్లి పెట్టే దెయ్యం… భయపెడుతూ నవ్విస్తున్న హారర్ మూవీ

Horror Comedy OTT: ఫ్యాక్టరీలో లొల్లి పెట్టే దెయ్యం… భయపెడుతూ నవ్విస్తున్న హారర్ మూవీ

Horror Comedy OTT : హారర్ సినిమాలు క్రేజీగా ఉంటాయి. భయపెట్టే దెయ్యాలు, కామెడీ దెయ్యాలతో ఈ సినిమాలు భలే మాజాగా ఉంటాయి. ఇక ఈ మధ్య ఈ హారర్ కామెడీ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ, ఒక దెయ్యం ఉండే పాత ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముగ్గురు కార్పెంటర్లు పడే ఇబ్బందులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఇది రియల్ సంఘటనల ఆధారంగా రూపొంది నట్లు చిత్ర యూనిట్ కూడా చెప్పింది. ఇక సినిమాలోని ఎక్కువ భాగం నిజమైన పాత ఫ్యాక్టరీలలోనే షూట్ చేశారు. ఆ వాతావరణం ప్రేక్షకులకు ఒరిజినల్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి. హారర్ సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు. దర్శకుడు ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీగా తెరకెక్కించారు.

షెమరూమీ (ShemarooMe) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ గుజరాతీ హారర్ కామెడీ సినిమా పేరు ‘కార్ఖాను’ (Karkhanu). రిషభ్ థక్కర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో తుషార్ సాధు, కింజల్ రాజ్‌ప్రియ, హేమాంగ్ దవే, అల్కా అమీన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2024 ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం షెమరూ మీ (ShemarooMe) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

ముగ్గురు కార్పెంటర్లు కలిసి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని సంబరపడుతారు. పని కోసం ఒక పాత కార్ఖాను (ఫ్యాక్టరీ) కి వెళ్తారు. మస్తు పైసలు వస్తాయి, పని కానిచ్చేద్దామని ఫిక్స్ అయి లోపలికి అడుగుపెడతారు. తీరా చూస్తే అక్కడ అంతా గాలీ, ధూళీ, పాత సామాన్లు తప్ప ఏమీ ఉండదు. కానీ వీళ్లు పని మొదలుపెట్టగానే అక్కడ ఉన్న సామాన్లు వాటంతట అవే కదలడం, వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. ఇక ఈ కార్పెంటర్లకు అక్కడ దెయ్యం ఉందని మెల్లగా అర్థమవుతుంది. ఆ దెయ్యం వీళ్లని భయపెట్టడమే కాదు, వీళ్లు తెచ్చుకున్న , సుత్తులతోనే వీళ్ల మీద రివర్స్ లో కామెడీగా అటాక్ చేస్తుంటుంది. ఒక పక్క ప్రాణ భయం, ఇంకో పక్క ఆ దెయ్యం చేసే వింత పనులు చూసి వీళ్లు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. పని చేయడానికి వెళ్లిన వాళ్లు, ప్రాణాలు కాపాడుకోవడానికి పడే పాట్లు భలే ఫన్నీగా ఉంటాయి. అసలు ఆ కార్ఖానాలో ఆ దెయ్యం ఎందుకు ఉంది? ఈ కార్పెంటర్లనే ఎందుకు టార్గెట్ చేసింది? వీళ్ళంతా ఆ గండం గట్టెక్కి బయట పడ్డారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  స్పృహ లేని అమ్మాయితో రచ్చ చేసే రాక్ స్టార్ … పెళ్లి అంటూ రాత్రికి రాత్రే పాడుపని

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×