Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. అయితే వీటిలో కొన్ని సినిమాలు పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఈ సినిమాలను కళ్లార్పకుండా చూస్తూనే ఉంటారు కొంత మంది ఆడియన్స్. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇందులో ఎవిలిన్ అనే అమ్మాయి తన 21వ పుట్టినరోజును మద్యం మత్తులో జరుపుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఒక సెలబ్రిటీతో రచ్చ రంబోల అవుతుంది. ఒంటరిగా చూడాల్సిన సినిమా ఇది.
ఈ అమెరికన్ రొమాంటిక్ సినిమా పేరు ‘లిక్’ (Lick). 2024 డిసెంబర్ 19న వచ్చిన ఈ సినిమా కైలీ స్కాట్ అనే రచయిత్రి రాసిన రొమాంటిక్
నవల ఆధారంగా రూపొందింది. ఇందులో బ్రూక్ లీ (ఎవిలిన్), ట్రావిస్ బర్న్స్ (డేవిడ్) అనే జంట రొమాంటిక్ ఆడియన్స్ లో వేడిని పుట్టించారు. లూయిస్ ఆల్స్టన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఒక మ్యూజికల్ రొమాన్స్ డ్రామా Passionflix (ప్యాషన్ ఫ్లిక్స్) అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. రొమాంటిక్, ఎడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల కోసమే ఫేమస్ అయింది ఈ ఓటీటీ. హీరోగా నటించిన ట్రావిస్ బర్న్స్ ఒక ఆస్ట్రేలియన్ యాక్టర్. హీరోయిన్ బ్రూక్ లీ కి ఇది ఒక పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా. ఇది ఒక రాక్ స్టార్ చుట్టూ తిరిగే కథ కాబట్టి, ఇందులో రొమాన్స్ తో పాటు, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది.
ఇందులో హీరోయిన్ ఎవిలిన్ తన 21వ పుట్టినరోజు పార్టీ కోసం లాస్ వేగాస్ వెళ్తుంది. అక్కడ ఫుల్లుగా మందు కొట్టి, ఏం చేస్తున్నామో తెలియని మత్తులో ఒకడిని పెళ్లి చేసుకుంటుంది. తెల్లారి లేచి చూసేసరికి ఒంటి మీద పచ్చబొట్టు, వేలికి ఉంగరం ఉంటాయి. పక్కన చూస్తే ఎవడో ఒక అందమైన కుర్రాడు పడుకుని ఉంటాడు. అసలు వాడు ఎవడో, రాత్రి ఏం జరిగిందో ఆమెకు అస్సలు గుర్తుండదు. తర్వాత తెలిసే విషయం ఏంటంటే, ఆ రాత్రి మత్తులో ఆమె ఒక స్ట్రెంజర్ ని పెళ్లి చేసుకుంటుంది. చేసుకున్నది ఎవరో కాదు.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ‘స్టేజ్ డైవ్’ అనే రాక్ బ్యాండ్ గిటారిస్ట్ డేవిడ్ ఫెర్రిస్. అతను కోట్లు సంపాదించే పెద్ద సెలబ్రిటీ. ఇక ఒక సాదాసీదా అమ్మాయి, ఒక తోపు రాక్ స్టార్ పెళ్లి చేసుకున్నారనే విషయం తెలియగానే మీడియా వాళ్లు, ఫ్యాన్స్ ఆమె వెంటపడతారు. ఆ హంగామా భరించలేక ఎవిలిన్ పారిపోవాలని చూస్తుంది. అయితే డేవిడ్ మాత్రం ఆమెను వదులుకోవడానికి ఇష్టపడడు. మత్తులో అన్నీ జరిగినా నువ్వు నా పెళ్ళానివని ఆమె చుట్టూ తిరుగుతాడు. మరి అమ్మాయిల పిచ్చి ఉన్న రాక్ స్టార్‌తో ఈ అమ్మాయి ప్రయాణం ఎలా సాగింది? చివరకు వాళ్లు విడిపోయారా ? నిజంగానే ప్రేమలో పడ్డారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.