E-Paper
Advertisement

అందమైన దెయ్యం ప్రేమలో పడే యువకుడు… నవ్వి నవ్వి చచ్చే కామెడీ

అందమైన దెయ్యం ప్రేమలో పడే యువకుడు… నవ్వి నవ్వి చచ్చే కామెడీ
Advertisement

Horror Comedy OTT : దెయ్యాల సినిమాలు బాగా భయపెడుతాయి. అయితే కామెడీ హారర్ సినిమాలు ఒక పక్క నవ్వు తెప్పిస్తూ, మరో వైపు భయపెడుతుంటాయి. ఈ రెండో రకం సినిమాలను ఆడియన్స్ తెగ చూస్తున్నారు. కంటెంట్ కూడా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుండటంతో వీటిని అస్సలు వదలటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా థాయ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కూడా అయింది. కొంచెం రొమాన్స్, కొంచెం భయం, కొంచెం కామెడీతో ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం వర్షం నేపథ్యంలో సాగుతూ, ఒక రకమైన భయానక వాతావరణాన్ని కలిగిస్తుంది.థాయ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి, ఈ చిత్రం ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. సుమారు 1 గంట 40 నిడివి ఉన్న ఈ సినిమా చూపు తిప్పుకోనివ్వదు.

యూట్యూబ్‌లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా పేరు ‘లవ్ రెయిన్’ (Love Rain). 2017లో వచ్చిన ఈ థాయ్ సినిమాను తెలుగులోకి కూడా అదే పేరుతో డబ్ చేశారు. థాయ్‌లాండ్‌లో ‘రాక్ నామ్ కాంగ్’ (Rak Nam Khang) అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. ఇందులో హీరోగా నటించిన కిట్‌కాంగ్ ఖమ్‌కిత్, హీరోయిన్ సామీ కోవెల్ అక్కడి ఇండస్ట్రీలో చాలా పాపులర్ స్టార్స్. ముఖ్యంగా సామీ కోవెల్ తన గ్లామర్, యాక్టింగ్‌తో ఈ హారర్ స్టోరీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో వాడిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ భయాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యూట్యూబ్‌ (Youtube)లో ఇది ఉచితంగా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గ్యాబ్ అనే ఒక ధనవంతుల అబ్బాయి ఏ పనీ చేయకుండా జల్సాలు చేస్తుంటాడు. వాడికి బుద్ధి చెప్పాలని వాళ్ల నాన్న డబ్బులు ఇవ్వడం ఆపేసి, ఒక షాపులో పనికి పంపిస్తాడు. అయితే అక్కడ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు, వర్షం పడే సమయంలో సోమ్ అనే ఒక అందమైన అమ్మాయి అతనికి కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడిన గ్యాబ్, ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. కానీ కొన్నాళ్ల తర్వాత గ్యాబ్‌కు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి మనిషి కాదు, ఒక ఆత్మ అని అర్థమవుతుంది. ఆమె ఇదివరకే చనిపోయిందని, కానీ ఏదో కారణం వల్ల ఆత్మలా తిరుగుతోందని తెలుసుకుంటాడు. మొదట భయపడినా, ఆమె మీద ఉన్న ఇష్టంతో ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అసలు సోమ్ ఎలా చనిపోయింది? ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చేయాలి? అనే విషయాలతో ఈ కథ ముగుస్తుంది.

Read Also : వెన్నులో వణుకు పుట్టే తీర్పులు ఇచ్చే డెవిల్ జడ్జి… టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటున్న కే డ్రామా

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×