E-Paper
Advertisement

వెన్నులో వణుకు పుట్టే తీర్పులు ఇచ్చే డెవిల్ జడ్జి… టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటున్న కే డ్రామా

వెన్నులో వణుకు పుట్టే తీర్పులు ఇచ్చే డెవిల్ జడ్జి… టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటున్న కే డ్రామా

Legal Thriller OTT : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతున్నాయి. చాలా మంది వీటిని చూస్తూ చానల్ మార్చడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక ఆ సిరీస్ ల డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా ఫాలో అవుతూ తెగ సంబరపడిపోతున్నారు మన ఆడియన్స్. అయితే ఇప్పుడు ఒక క్రేజీ కొరియన్ సిరీస్ గురించి చెప్పుకోవాల్సిందే. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ కూడా ఉంది. కొరియాలో భవిష్యత్తులో అవినీతి పెరిగిపోయినప్పుడు, ప్రజలందరూ మొబైల్ యాప్ ద్వారా తీర్పును నిర్ణయించే ‘లైవ్ కోర్ట్ షో’ను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో స్టోరీ మస్త్ మజా ఇస్తుంది. ప్రజలందరూ ఒక యాప్ ద్వారా తీర్పును ఇవ్వడమనేది ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన థ్రిల్‌ను కూడా ఇస్తుంది. అందుకే ఈ సిరీస్ కొరియాలో సూపర్ హిట్ కూడా అయింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ డిస్టోపియన్ కొరియన్ సిరీస్ పేరు ‘ది డెవిల్ జడ్జి’ (The Devil Judge). 2021లో వచ్చిన ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, దీని కథను మూన్ యూ-సోక్ అనే మాజీ జడ్జి స్వయంగా రాశారు. ఆయనకు న్యాయ వ్యవస్థలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉండటంతో, కోర్టు గదిలోని డ్రామా, చట్టంలోని లొసుగులను చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇక జి సంగ్ తన అద్భుతమైన నటనతో కాంగ్ యో-హన్ పాత్రకు ప్రాణం పోశారు. ఒకవైపు క్రూరమైన జడ్జిగా కనిపిస్తూనే, మరోవైపు తన గతం తాలూకు బాధను అనుభవించే వ్యక్తిగా ఆయన పండించిన హావభావాలు మెప్పిస్తాయి. విలన్ పాత్రలో కిమ్ మిన్-జుంగ్ నటన కూడా హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె పోషించిన జుంగ్ సున్-ఆ పాత్ర, అమాయకంగా కనిపిస్తూనే అత్యంత ప్రమాదకరమైన ప్లాన్లు వేసే ఒక పవర్‌ఫుల్ విమెన్ క్యారెక్టర్‌గా కొరియన్ డ్రామాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇది Netflix, Prime Video, Viki ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

భవిష్యత్తులో సమాజం మొత్తం అవినీతితో నిండిపోయి, ప్రజలకు చట్టం మీద నమ్మకం పోతుంది. అప్పుడు ప్రభుత్వం ‘లైవ్ కోర్ట్ షో’ అనే ఒక కొత్త విధానాన్ని తెస్తుంది. ఇందులో కోర్టు విచారణను టీవీలో లైవ్‌గా చూపిస్తూ, నిందితుడికి ఏ శిక్ష వేయాలో ప్రజలే తమ ఫోన్లలో ఓటు వేసి నిర్ణయించాలి. ఈ కోర్టుకు చీఫ్ జడ్జిగా కాంగ్ యో-హన్ ఉంటాడు. ఇక కాంగ్ యో-హన్ ఇచ్చే తీర్పులు చాలా క్రూరంగా, వింతగా ఉంటాయి. ధనవంతులను, అధికారం ఉన్నవారిని వదలకుండా శిక్షిస్తుండటంతో ప్రజలు అతన్ని దేవుడిలా చూస్తారు. కానీ చట్టం ప్రకారం వెళ్లాలనుకునే కిమ్ గా-ఓన్ అనే ఒక కుర్ర జడ్జికి యో-హన్ పద్ధతులు నచ్చవు. అసలు యో-హన్ నిజంగా న్యాయం చేస్తున్నాడా లేక తన సొంత పగ తీర్చుకుంటున్నాడా అని కిమ్ గా-ఓన్ నిఘా పెడతాడు.

ఈ క్రమంలోనే జుంగ్ సున్-ఆ అనే పవర్ ఫుల్ లేడీ ఎంట్రీ ఇస్తుంది. ఈమె ఒకప్పుడు యో-హన్ ఇంట్లో పనిమనిషిగా ఉండి, ఇప్పుడు దేశాన్నే శాసించే ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్’కు హెడ్ అవుతుంది. ఈమె యో-హన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి రకరకాల కుట్రలు చేస్తుంది. ఈ ముగ్గురి చుట్టూ సరీస్ ఊహించని ట్విస్ట్లు ఇస్తూ ఆసక్తికరంగా నడుస్తుంది. చివరికి యో-హన్ గతం ఏమిటి ? అతను ప్రతీకారం తీర్చుకొనేఎందుకే జడ్జ్ అవతారం ఎత్తాడా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కేసు ఏదైనా సరే కామెడీతో దుమ్ము రేపే కొరియన్ డిటెక్టివ్… క్లైమాక్స్ వరకు నవ్వులే

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×