E-Paper
Advertisement

పగలు ప్రశాంతం రాత్రి అయితే నరకం… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టించే వింత పిశాచి

పగలు ప్రశాంతం రాత్రి అయితే నరకం… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టించే వింత పిశాచి
Advertisement

Horror Comedy OTT : కామెడీ జానర్ లో వచ్చే దెయ్యాల సినిమాలు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలే, కోట్లు కూడా కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక థాయ్ మూవీ గురింది చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా ఒక పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది. అక్కడ రాత్రి అయితే ఒక దెయ్యం భయపెడుతుంటుంది. ఈ క్రమంలో కథ కామెడీ మలుపులు తీసుకుంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ థాయ్ (Thai) హారర్ కామెడీ సినిమా పేరు ‘ఘౌల్: హారర్ ఎట్ ద హౌలింగ్ ఫీల్డ్’ (The Ghoul: Horror at the Howling Field). ఈ సినిమా థాయ్‌లాండ్‌లో 2020 అక్టోబర్ 22న రిలీజ్ అయ్యింది. అక్కడ దీని అసలు పేరు ‘లువాంగ్ పీ కాప్ ఈ-పాప్’ (Luang Phee Kap E-Pop). ఈ సినిమాలో థాయ్ జానపద కథల్లో ఉండే ‘పాప్’ అనే భయంకరమైన దెయ్యం కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. దర్శకుడు చలేర్మ్ వాంగ్పిమ్ హారర్‌కు కామెడీని జోడించి, గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ మసాలా సినిమాగా దీన్ని మలిచారు. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి. నటీనటుల విషయానికి వస్తే, థాయ్ కామెడీ స్టార్స్ అయిన కామ్పన్ అక్ఖరాడ్, నత్తావుత్ స్లమ్ తమ నటనతో అదరగొట్టారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే పంచ్ డైలాగులు, వింత వింత ఎక్స్‌ప్రెషన్లు ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తాయి. కేవలం భయపెట్టడమే కాకుండా, పల్లెటూరి మనుషుల అమాయకత్వాన్ని, వాళ్ళ నమ్మకాలని చాలా ఫన్నీగా చూపించారు ఈ సినిమాలో. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

థాయ్ లాండ్ లో తుంగ్ మా హోర్న్ అనే ఒక మారుమూల పల్లెటూరు ఉంటుంది. ఆ ఊరి పేరు వింటేనే చుట్టుపక్కల వాళ్లకి వణుకు. ఎందుకంటే ఆ ఊరి పొలాల్లో రాత్రి పూట వింత వింత శబ్దాలు, ఏడుపులు వినిపిస్తుంటాయి. ఏదో దెయ్యం ఊరి మీద పడి మనుషుల్ని వేధిస్తుందని అందరూ గజగజ లాడిపోతుంటారు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ ఊరికి ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కోసం వస్తాడు. అతనికి తోడుగా బుక్ కీమ్ అనే ఒక లోకల్ కుర్రాడు తగులుతాడు. వీళ్లిద్దరూ కలిసి ఆ ఊరి గుట్టు తేల్చాలని ఫిక్స్ అవుతారు. ఆ ఊర్లో వుంగ్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చూడటానికి అందంగానే ఉన్నా, ఊర్లో వాళ్లందరికీ ఒకటే డౌట్.. ఆమె మామూలు మనిషి కాదు, రాత్రి పూట రక్తం తాగే దెయ్యం అని ప్రచారం చేస్తారు.

ఇక హీరో ఏమో అదంతా ఉత్తదే, దెయ్యాలు గియ్యాలు లేవు అని నమ్ముతాడు. కానీ రాత్రి అయ్యేసరికి ఊరి బయట పొలాల్లో జరిగే వింతలు చూసి హీరోకి కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడ ఉన్నది నిజంగా దెయ్యమా లేక ఎవరైనా మనుషులు ఆడుతున్న డ్రామానా అనేది తేల్చడానికి హీరో పడే తంటాలు మామూలుగా ఉండవు. ఒక పక్క భయం వేస్తుంటే, ఇంకో పక్క హీరో చేసే కామెడీ పీక్స్‌లో ఉంటుంది. దెయ్యం నుంచి తప్పించుకోవడానికి వీళ్లు వేసే వేషాలు, పడే పాట్లు చూస్తే నవ్వాలో భయపడాలో అర్థం కాదు. క్లైమాక్స్‌లో అసలు ఆ ఆత్మ ఎవరు? ఆ గ్రామంలో బయట పడని రహస్యం ఏంటి? అనే విషయాలతో స్టోరీ ముగుస్తుంది.

Advertisement

Read Also : ప్రేమ కోసం రిస్క్ చేసే ప్రియురాలు… ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×