E-Paper
Advertisement

తలనొప్పి కాదు ఇది నరకం! మైగ్రేన్, సాధారణ తలనొప్పి మధ్య తేడాలివే

తలనొప్పి కాదు ఇది నరకం! మైగ్రేన్, సాధారణ తలనొప్పి మధ్య తేడాలివే
Advertisement

Headache: తలనొప్పి రాగానే అందరం ఒకే రకమైన పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాం. కానీ మీకు తెలుసా? సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సాధారణ తలనొప్పి కాసేపు ఉండి వెళ్ళిపోతే.. మైగ్రేన్ మాత్రం మనల్ని ఒక గదిలో బంధించి, వెలుతురును కూడా చూడనివ్వకుండా టార్చర్ పెడుతుంది. అసలు మీకు వస్తోంది నార్మల్ తలనొప్పేనా లేక మైగ్రేన్ విలనా ? ఈ రెండింటిని ఎలా గుర్తించాలి ? క్లారిటీ కోసం పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తలనొప్పి vs మైగ్రేన్: మీరు తెలుసుకోవాల్సిన అసలు తేడాలు

Advertisement

చాలామంది తలనొప్పి వస్తే దాన్ని మైగ్రేన్ అని కంగారు పడుతుంటారు. లేదా మైగ్రేన్‌ని మామూలు తల నొప్పి అని లైట్ తీసుకుంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం వల్ల సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం సులభం అవుతుంది.

1. సాధారణ తలనొప్పి :
ఇది సాధారణంగా ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం లేదా కంటి చూపు సమస్యల వల్ల వస్తుంది.

Advertisement

ఎక్కడ వస్తుంది?: తలకు రెండు వైపులా పట్టేసినట్లు ఉంటుంది. నుదురు మీద లేదా తల వెనుక భాగంలో నొప్పి రావచ్చు.

నొప్పి ఎలా ఉంటుంది?: ఎవరో తలని గట్టిగా నొక్కినట్టు అనిపిస్తుంది. ఇది కొన్ని గంటల్లో తగ్గిపోతుంది.

ఇతర లక్షణాలు: సాధారణంగా తలనొప్పితో పాటు వాంతులు కానీ, వెలుతురు చూస్తే ఇబ్బంది కానీ ఉండదు.

2. మైగ్రేన్ :
మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు. అది ఒక నరాలకు సంబంధించిన సమస్య.

ఎక్కడ వస్తుంది?: మైగ్రేన్ నొప్పి తలకు ఒక వైపున మాత్రమే ఎక్కువగా ఉంటుంది. తల లోపల ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అనిపిస్తుంది.

సమయం: ఇది 4 గంటల నుంచి 3 రోజుల వరకు వేధించవచ్చు.

హెచ్చరిక సంకేతాలు: మైగ్రేన్ వచ్చే ముందు కొంత మందికి కళ్ల ముందు మెరుపులు కనిపించడం, చుక్కలు కనిపించడం వంటివి జరుగుతాయి. దీన్నే ‘ఆరా’ అంటారు.

సెన్సిటివిటీ: మైగ్రేన్ వచ్చినప్పుడు వెలుతురు చూసినా.. పెద్ద శబ్దాలు విన్నా భరించలేరు. వాంతులు, వికారం కూడా తోడవుతాయి.

Also Read: కళ్లలో మంటలు, దురద వేధిస్తున్నాయా? ఈ 5 కారణాలే మెయిన్ విలన్లు!

3. మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలు:
యూత్ లో మైగ్రేన్ పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

కెఫీన్: కాఫీ, టీలు అతిగా తాగడం లేదా మానెయ్యడం.

నిద్రలేమి: నైట్ అంతా ఫోన్ వాడటం వల్ల నిద్ర చెడిపోవడం.

స్మెల్స్: గాఢమైన పర్ఫ్యూమ్స్ లేదా పొగ వాసన.

హార్మోన్లు: అమ్మాయిల్లో పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ రావచ్చు.

సాధారణ తలనొప్పికి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ మైగ్రేన్ తరచుగా వస్తుంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించి మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్ మెడిసిన్ వాడటం మంచిది. హెల్తీ ఫుడ్, మెడిటేషన్, టైమ్ కి నిద్రపోవడం ద్వారా ఈ ‘పీడ’ నుంచి తప్పించుకోవచ్చు.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×