E-Paper
Advertisement

Horror Comedy OTT: సమాధిలో నుంచి వచ్చే శవాలు… పరుగులు పెట్టే ఊరి జనం… కేక పెట్టించే కామెడీ కూడా

Horror Comedy OTT: సమాధిలో నుంచి వచ్చే శవాలు… పరుగులు పెట్టే ఊరి జనం… కేక పెట్టించే కామెడీ కూడా
Advertisement

Horror Comedy OTT : జాంబీ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి చేసే దండయాత్రను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది కూడా. అయితే ఇప్పుడు మనం చెపుకోబోయే సినిమాలో చనిపోయిన వాళ్ళు జాంబీలుగా మారి మళ్ళీ లేచి వస్తారు. అయితే ఇందులో జాంబీలు సాధారణ జాంబీలలా కాకుండా, వాళ్ళు బ్రతికున్నప్పుడు దేనినైతే ఇష్టపడేవారో వాటి కోసమే వెతుకుతుంటారు. పర్యావరణ మార్పుల వల్ల జరిగే నష్టాన్ని దర్శకుడు చాలా వెటకారంగా చూపించాడు ఇందులో. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ జాంబీ కామెడీ మూవీ పేరు ‘ది డెడ్ డోంట్ డై’ (The Dead Don’t Die). దీనికి జిమ్ జార్ముష్ దర్శకత్వం వహించారు. ఇందులో బిల్ ముర్రే, ఆడమ్ డ్రైవర్, టిల్డా స్వింటన్, సెలెనా గోమెజ్ వంటి హాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాను Amazon Prime Video, Apple TV, Zee5 వంటి ప్లాట్‌ ఫామ్‌లలో చూడవచ్చు. ఈ సినిమా 2019 మే 14న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఇది 2019 జూన్ 14న ఫోకస్ ఫీచర్స్ ద్వారా అమెరికాలోని థియేటర్లలో విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద $15.3 మిలియన్లు సంపాదించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన ఊరిలో సడన్‌గా వింతలు మొదలవుతాయి. అక్కడ పగలు చాలా సేపు ఉంటుంది. ఫోన్లు సరిగ్గా పనిచేయవు, జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి. భూమి తన కక్షను మార్చుకోవడంతో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంతలో మరింత భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అప్పుడు ఆ ఊరి స్మశానంలో ఉన్న శవాలన్నీ జాంబీలుగా మారి బయటకు వచ్చేస్తాయి. అయితే ఈ జాంబీలు మిగతా సినిమాల్లా కాకుండా, బతికున్నప్పుడు దేనినైతే ఎక్కువగా ఇష్టపడేవారో వాటి పేర్లు కలవరిస్తూ ఊరి మీద పడతాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి లోకల్ పోలీస్ ఆఫీసర్లు క్లిఫ్, రోనీ రంగంలోకి దిగుతారు. వాళ్ళకి ఊరిలో ఉండే శవాల కాపరి సహాయం చేస్తుంది. చివరికి ఆ జాంబీలను ఆపడం ఎవరి వల్లా కాదు. అయితే క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది ? ఆ ట్విస్ట్ ఏమిటి ? జాంబీలను ఎవరైనా కంట్రోల్ చేస్తారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×