E-Paper
Advertisement

Romantic movie OTT: ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే

Romantic movie OTT: ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే
Advertisement

Romantic movie OTT : ఒక రోడ్ ట్రిప్ మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను చూడచ్చు. అయితే ఇది ఒంటరిగా చూడాల్సిన సినిమా. కాస్త మసాలా కంటెంట్ కూడా ఉంటుంది. అయితే ఇది ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఈ కథ ఇద్దరు యువకులు, ఒక పెళ్లైన మహిళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు కలిసి మెక్సికోలో ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్తారు. ఈ ప్రయాణంలో చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ మెక్సికన్ రోడ్ ట్రిప్ మూవీ పేరు ‘వై తూ మామా తాంబియెన్’ (Y tu mamá también). దీనిని ప్రముఖ దర్శకుడు అల్ఫోన్సో కువరాన్ తెరకెక్కించారు. ఇందులో గాయెల్ గార్సియా బెర్నల్, డియెగో లూనా, మారిబెల్ వెర్డు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ కూడా పొందింది. ఇది మొదటి వారాంతంలో $2.2 మిలియన్లు సంపాదించి, మెక్సికన్ సినిమాలో అత్యధిక బాక్సాఫీస్ ఓపెనింగ్‌గా కొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాను చూడాలనుకుంటే ప్రస్తుతం ఇది Netflix లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టెనోచ్, జూలియో అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరూ మాంచి కుర్రాళ్ళే కాని ఎప్పుడూ అమ్మాయిలు, ఎంజాయ్‌మెంట్ అని తిరుగుతుంటారు. వీళ్ల లైఫ్ బోర్ కొడుతున్న టైంలో, ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో లూయిసా అనే ఒక పెళ్లైన అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెతో కాస్త క్లోజ్ అయి, ఆమెను ఇంప్రెస్ చేయడానికి మేము ఒక అందమయిన బీచ్‌కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడుగుతారు. అయితే లూయిసా తన భర్త తనను మోసం చేస్తున్నాడని తెలిసి, బాధలో వీరితో కలిసి రావడానికి ఒప్పుకుంటుంది. అలా ముగ్గురూ కలిసి ఒక పాత కారులో రోడ్ ట్రిప్ మొదలుపెడతారు.

దారి పొడవునా వీళ్లు తాగుతూ, జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ మెల్లగా లూయిసా మీద ఇద్దరికీ ఇష్టం మొదలవుతుంది. దీనివల్ల ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు, అసూయ మొదలవుతాయి. చివరికి వాళ్లు అనుకున్న బీచ్‌కి చేరుకుంటారు. అక్కడ గడిపిన ఒక రాత్రి వాళ్ళ జీవితాలను, వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ట్రిప్ అయిపోయాక ముగ్గురూ విడిపోతారు. చాలా కాలం తర్వాత ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ కలిసినప్పుడు, లూయిసా గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏంటనేది సినిమా చూస్తేనే బాగుంటుంది.

Advertisement

Read Also : మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×