E-Paper
Advertisement

Horror Drama ott : వాష్ రూమ్ లో ఇదేం పని సామీ… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ మూవీ

Horror Drama ott : వాష్ రూమ్ లో ఇదేం పని సామీ… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ మూవీ
Advertisement

Horror Drama ott : హారర్ జానర్ సినిమాలను చూడాటానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. భయపడుతూ ఎంటర్టైన్ అవుతుంటారు. ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక మొబైల్ యాప్‌ చుట్టూ తిరుగుతుంది. దానిని ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు దారుణంగా చనిపోతుంటారు. ఇది క్లైమాక్స్ వరకు కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది, దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2019లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ మూవీ పేరు ‘కౌంట్‌డౌన్’. ఇది జస్టిన్ డిసెంబరు దర్శకత్వం వహించిన మూవీ. ఇందులో ఎలిజబెత్ లైల్ లీడ్ రోల్ లో నటించగా, జోర్డాన్ కాల్లోవే, తలితా బాటెమాన్, టిచినా ఆర్నాల్డ్, P.J. బైర్నే, పీటర్ ఫాసినెల్లి, అన్నే వింటర్స్ మిగతా పాత్రల్లో నటించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో 2019 అక్టోబర్ 25న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా థియేటర్‌లలో విడుదల అయింది. $6.5 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $48 మిలియన్లు వసూలు చేసి, కమర్షియల్ గా విజయం సాధించింది. ప్రస్తుతం Prime Video, Netflix ఓటీటీలలో ఇది అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  మాస్క్ వేసుకుని మర్డర్స్… ప్రేమికులని మాత్రమే చంపే సైకో… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

స్టోరీ ఏమిటంటే

క్విన్ అనే ఒక యంగ్ నర్స్ తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి ఒక రాత్రి పార్టీకి వెళ్తుంది. అక్కడ ఒకరు కౌంట్‌డౌన్ అనే యాప్ గురించి చెప్తారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడు చనిపోతారో ఖచ్చితమైన టైమ్ చూపిస్తుంది. క్విన్ ఆ యాప్ డౌన్‌లోడ్ చేస్తుంది. ఆమెకు 3 రోజుల 2 గంటల్లో చావు వస్తుందని చూపిస్తుంది. మొదట ఆమె దాన్ని జోక్‌గా తీసుకుంటుంది కానీ ఆ తర్వాత ఆమె చుట్టూ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. క్విన్ ఫ్రెండ్స్ కూడా యాప్ డౌన్‌లోడ్ చేస్తారు. వాళ్లలో కొందరు టైమ్ ముగిసిన తర్వాత భయంకరంగా చనిపోతారు.

Advertisement

క్విన్ ఇప్పుడు తన జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంది. ఆమె యాప్‌ను డిలీట్ చేయాలని ట్రై చేస్తుంది కానీ అది పని చేయదు. యాప్ వెనక ఒక సూపర్‌నాచురల్ ఎంటిటీ ఉందని తెలుస్తుంది. అది మనుషుల భయాన్ని ఉపయోగించి వాళ్లను చంపేస్తుంది. క్విన్ ఈ పరిస్థితి నుంచి బయట పడుతుందా ? ఆ యాప్‌ చూపించిన టైమ్ కి తాను కూడా చనిపోతుందా ? అనే విషయాలను ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ మూవీని చూసి తెలుసుకోండి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×