E-Paper
Advertisement

Psycho Thriller OTT : మాస్క్ వేసుకుని మర్డర్స్… ప్రేమికులని మాత్రమే చంపే సైకో… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Psycho Thriller OTT : మాస్క్ వేసుకుని మర్డర్స్… ప్రేమికులని మాత్రమే చంపే సైకో… గుండె ధైర్యం ఉంటేనే చూడండి
Advertisement

Psycho Thriller OTT : సైకో కిల్లర్స్ రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక వింత కథ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. గత ఏడాది వచ్చిన ఒక హాలీవుడ్ మూవీలో కిల్లర్ ప్రేమ జంటలను మాత్రమే చంపుతుంటాడు. క్లైమాక్స్ వరకు కథలో ప్రేమికులు పరుగులు పెడుతూనే ఉంటారు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 లో వచ్చిన ఈ అమెరికన్ రొమాంటిక్ స్లాషర్ మూవీ పేరు ‘హార్ట్ ఐస్’ (Heart eyes). జోష్ రూబిన్ దర్శకత్వంలో ఓలివియా హల్ట్, మేసన్ గుడింగ్, జోష్ రూబిన్, డీవన్ సావా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది వాలెంటైన్స్ డే సమయంలో జరిగే రొమాంటిక్ కిల్లర్ స్టోరీ. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. వాలెంటైన్స్ సీజన్‌కు ఫిట్ అయ్యే సినిమాఇది. ప్రస్తుతం netflix, prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  అడవిలో తెగిపడే తలలు… నరాలు తెగే ఉత్కంఠ… మెంటల్ మాస మర్డర్ మిస్టరీ మావా

స్టోరీ ఏమిటంటే

సియాటిల్ నగరంలో అల్లీ అనే యువతి ఒక ప్రముఖ జ్యువెలరీ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటుంది. ఇటీవలే బ్రేకప్ అవ్వడంతో ఆమె ప్రేమ పై విరక్తితో ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె రూపొందించిన ఒక అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ వివాదాస్పదం కావడంతో ఆమె బాస్ జే సిమన్స్ అనే కన్సల్టెంట్‌తో కలిసి పని చేయమని ఆదేశిస్తుంది. వాలెంటైన్స్ డే రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్‌లో పని నిమిత్తం డిన్నర్ చేస్తుంటారు. ఆ సమయంలో తన మాజీ ప్రియుడు కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో అక్కడకు రావడం చూసిన అల్లీ, అతనికి అసూయ కలిగించడానికి కావాలనే జేని ముద్దుపెట్టుకుంటుంది.

Advertisement

అయితే అక్కడే మాటువేసి ఉన్న “హార్ట్ ఐస్ కిల్లర్” వీరిద్దరినీ ఒక ప్రేమ జంటగా భావించి టార్గెట్ చేస్తాడు. వాళ్ళు అక్కడి నుండి తప్పించుకుని నగరం అంతా ప్రాణాల కోసం పరిగెత్తుతారు. ఇక వీళ్ళు కిల్లర్ నుండి తప్పించుకుంటూనే ప్రేమలో పడతారు. చివరికి ఈ జంట కిల్లర్ చేతికి చిక్కుతారా ? కిల్లర్ ప్రేమికులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ?అనే విషయాలను మాత్రం ఈ రొమాంటిక్ స్లాషర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×