E-Paper
Advertisement

Horror Drama OTT : ఈ ఫ్లైట్ ఎక్కితే పై ప్రాణాలు పైకే… రాత్రిపూట వెంటాడే హార్రర్ స్టోరీ

Horror Drama OTT : ఈ ఫ్లైట్ ఎక్కితే పై ప్రాణాలు పైకే… రాత్రిపూట వెంటాడే హార్రర్ స్టోరీ
Advertisement

Horror Drama OTT : దెయ్యాల సినిమాలు ఎక్కువగా పాత బంగ్లాలో, మారు మూల ప్రాంతాల నేపథ్యంలో ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే థాయ్ హారర్ థ్రిల్లర్ సినిమాలో దెయ్యాలు ఒక ఎగురుతున్న ప్లేన్ లోకి దూసుకొస్తాయి. ఇక అంతే గాల్లో ఉన్న ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతుంటాయి. ఒక్కో సీన్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. మీరు కూడా ఈ థ్రిల్ ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమా పై ఓ లుక్ వేయండి. వెన్నులో వణుకు పుట్టించే ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడవచ్చు?

2012లో వచ్చిన ఈ థాయ్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘407 డార్క్ ఫ్లైట్’ (407 Dark Flight). ఇది థాయ్‌లాండ్‌లో 3Dలో రూపొందిన మొదటి హారర్ సినిమాగా గుర్తింపు పొందింది. ఇసారా నాదీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మార్షా వట్టనపనిచ్, పీటర్ నైట్ లీడ్ రోల్స్ లో నటించారు. అసలు భాష థాయ్ కానీ ఇది తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి డబ్ చేయబడింది. 2026 నాటికి కూడా ఈ సినిమా హారర్ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. సినిమా థాయ్ హారర్ జానర్‌లో బాగా పాపులర్ అయింది కూడా. ఇది ప్రస్తుతం prime videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : సలసలా మరిగే సముద్రం… స్విమ్మింగ్ కెళ్ళి ఉడికిపోయే అమ్మాయి… గుండె గల్లంతయ్యే సీన్లు

కథలోకి వెళ్తే

పదేళ్ల క్రితం ఒక భయంకరమైన విమాన ప్రమాదం నుండి న్యూ అనే ఎయిర్ హోస్టెస్ ప్రాణాలతో బయటపడుతుంది. అయితే అందులో ఉన్న వాళ్ళు ఆ ఘోర ప్రమాదంలో చెల్లాచెదురై ప్రాణాలు విడుస్తారు. ఆమె కోలుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరుతుంది. కానీ ఆమె ప్రయాణిస్తున్న విమానం పాత విమానాన్నే రంగులు మార్చి కొత్తదానిలా సిద్ధం చేశారని ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ఇక విమానం గాల్లోకి ఎగిరాక అసలు కథ మొదలవుతుంది. ఆ విమానంలో ఉన్నట్టుండి చనిపోయిన వారి ఆత్మలు ప్రయాణికులను వేధించడం ప్రారంభిస్తాయి. గాల్లో ఉన్న విమానం నుండి ఎవరూ తప్పించుకోలేని పరిస్థితుల్లో కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంటుంది ఈ సీన్స్ చూస్తే. చివరికి ఆ దెయ్యాల నుండి ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకున్నారా ?  అసలు విమానం కిందకు దిగిందా ? ఆ దెయ్యాలు ఏమవుతాయి ? అనేదే ఈ థాయ్ హారర్ థ్రిల్లర్ మిగిలిన కథ.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×