E-Paper
Advertisement

Horror Film OTT : మనుషుల్ని ఇష్టమొచ్చిన స్టైల్ లో వండుకుని తినే నరమాంస భక్షకులు… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు సామీ

Horror Film OTT : మనుషుల్ని ఇష్టమొచ్చిన స్టైల్ లో వండుకుని తినే నరమాంస భక్షకులు… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు సామీ

Horror Film OTT : కానిబల్ కాన్సెప్ట్ అనగానే ఎవ్వరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కానీ అలాంటి సినిమాలే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటాయి. అందుకే ఈ జానర్లో సినిమాలు వస్తే వదిలి పెట్టకుండా చూస్తారు మూవీ లవర్స్. మీకు కూడా ఇలాంటి సినిమాలంటే స్పెషల్ ఆసక్తి ఉందా ? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ కథేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సర్వైవల్ హారర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ‘ది గ్రీన్ ఇన్‌ఫెర్నో’ (The Green Inferno). 2013లో విడుదలైన ఈ మూవీకి ఎలీ రోత్ దర్శకత్వం వహించారు. వరల్డ్‌వ్యూ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో లోరెంజా ఇజ్జో, ఏరియల్ లేవీ హీరోహీరోయిన్లుగా నటించారు. డారిల్ సబారా, కిర్బీ బ్లిస్ బ్లాంటన్, స్కై ఫెర్రీరా, నికోలాస్ మార్టినెజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ అమెజాన్ జంగిల్ కానిబల్ హారర్ థ్రిల్లర్ ను 1970-80ల ఇటాలియన్ కానిబల్ ఫిల్మ్స్ (కానిబల్ హోలోకాస్ట్ లాంటివి) వాటికి అంకితం చేశారు మేకర్స్. 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని 2015 సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ ఆడియోతో సబ్‌టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంది. కానీ ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ ఉంటుంది సినిమాలో. కాబట్టి వీక్ హార్ట్ ఉన్న వాళ్లు మూవీని స్కిప్ చేయండి.

Read Also :  కన్న తండ్రినే చంపాలనుకునే కొడుకు… ఊహించని ట్విస్టులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

స్టోరీలోకి వెళ్తే…

సాధారణంగా ఫ్రెండ్స్ లేదా కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్స్ గా ట్రిప్ లకు వెళ్తూ ఉంటారు. కానీ అలా వెళ్ళినప్పుడు మనుషుల్నే తినే మనుషుల చేతిలో పడితే ఎంత దారుణంగా ఉంటుందో కదా. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఈ మూవీలో కూడా అచ్చం అలాంటిదే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ట్రిప్ కి కాకుండా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళి ఇరుక్కుంటారు. సినిమా మొత్తం న్యూయార్క్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్ చుట్టూ నడుస్తుంది. హీరోయిన్ జస్టిన్ (లోరెంజా ఇజ్జో) సోషల్ యాక్టివిజం గ్రూప్‌ లో కొత్తగా జాయిన్ అవుతుంది. దానికి లీడర్ అలెజాండ్రో (ఏరియల్ లేవీ). అయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ లో చెట్లు నరికేసి ఓ కార్పొరేట్ సంస్థ చేస్తున్న వినాశనాన్ని ఈ గ్రూప్ వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగా ప్రొటెస్ట్ చేయడానికి తన టీమ్‌ ని అక్కడికి తీసుకువెళ్తాడు.

అక్కడికి వెళ్ళాక వీడియోను తీసి వైరల్ చేస్తారు. ఆ కార్పొరేట్ సంస్థ బాగోతం ప్రపంచం దృష్టిలో పడుతుంది. కానీ రిటర్న్ జర్నీలో హీరో టీం ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అవుతుంది. దీంతో దట్టమైన అమెజాన్ జంగిల్‌ లో చిక్కుకుంటారు. మనుషుల్ని తినే ట్రైబ్ కల్చర్ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్తారు. మరి అక్కడిని నుంచి ఎవరైనా తప్పించుకోగలిగారా ? అయితే ఎలా ? అన్నది స్టోరీ.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×