Horror Movie in OTT : ఇటీవల కాలంలో కామెడీ చిత్రాలతో పాటు హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండే సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇక గ తేడాది ఓటిటిలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. అందులో చాలా సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఓటీటీలోకి వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.. ఓటిటి సంస్థలు సినీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఆసక్తికర కంటెంట్ తో ఉన్న సినిమాలను రిలీజ్ కి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ బోల్డ్ మూవీని ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. మైండ్ బ్లాక్ అయ్యే టెస్టులతో ఆ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మూవీ పేరేంటి? మూవీ స్టోరీ ఏంటో? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మూవీ..
తెలుగు హారర్ మూవీ డీమన్.. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. సచిన్ మణి, అబర్నతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు.. రమేష్ పళనీవేల్ సినిమాను తెరకెక్కించారు. 2023 సెప్టెంబర్‌లో తమిళంలో రిలీజ్ అయ్యింది. దాదాపు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. సైకలాజికల్ హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, టర్న్‌లతో ప్రేక్షకులను మెప్పించింది.
ఓటీటీ..
దెయ్యాల స్టోరీతో రాబోతున్న సినిమా కావడంతో ఎక్కువ మంది ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డీమన్ హీరో సచిన్ మణి తమిళంలో దళపతి విజయ్ లియోలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. హీరోయిన్ అబర్నతి తమిళంలో ఇరగపట్రు మూవీతో పాటుగా పలు సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం బోలెడు హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి..
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీలో నయనతార భర్త డైరెక్టర్ విగ్నేశ శివన్ కీలకపాత్రలో నటించాడు… ఇందులో ఆయన ఒక మూవీ కోసం స్టోరీ రాసుకుంటూ ఉంటాడు. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కథ రాసుకోవడానికి సిటీ మధ్యలో ఉన్న కొత్త బంగళాకు షిప్ట్ అవుతాడు. ఆ బిల్డింగ్‌లో నిద్రపోయిన తర్వాత విఘ్నేష్ శివన్‌కు విచిత్రమైన కలలు వస్తుంటాయి. ఓ దయ్యం అతడిని చంపడానికి చూస్తుంది. నిజంగానే బిల్డింగ్‌లో దయ్యం ఉందా?.. ఆ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాన్ని అతను కనిపెడతాడా..? ఆ దెయ్యానికి అతని గర్ల్ ఫ్రెండు కార్తీకకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ మూవీలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అన్నది తెలియాలంటే సినిమాని మిస్ అవ్వకుండా చూడాల్సిందే… ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లో విచిత్రమైన కంటెంట్ మూవీస్ ను అందిస్తుంది..