Sekhar Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియో గ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ మాస్టర్(Sekhar Master) ఒకరు. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతోనూ అలాగే, బుల్లితెర కార్యక్రమాలతో శేఖర్ మాస్టర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన బుల్లి తెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో జడ్జిక వ్యవహరించడంతోపాటు స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ (Kirak Boys Khiladi Girls) అనే షోలో కూడా సందడి చేస్తున్నారు.
డాన్స్ మా ప్రపంచం..
ఇక ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శని ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగ ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఫ్రెండ్షిప్ డే స్పెషల్ (Friendship Day) ఎపిసోడ్ కావడంతో శేఖర్ మాస్టర్ తన ప్రాణ స్నేహితుడుతో వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ వేదిక పైకి రాగానే ఒకసారిగా ఒకరినొకరు హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా వీరిద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో వెంటనే యాంకర్ శ్రీముఖి అరే ఇద్దరు అటువైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.
ఫంక్షన్ హాళ్లు మమ్మల్ని కాపాడాయి….
ఇక ఈ ప్రోమోలో భాగంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి అలాగే వారు పడిన కష్టాల గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు. మేమిద్దరం డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో ఒకే చోట ఉండే వాళ్లమని, మాకు డాన్స్ తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని శేఖర్ మాస్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి రాత్రి వరకు మా పని డాన్స్ మాత్రమేనని తెలిపారు. కొన్నిసార్లు తినడానికి కూడా మాకు తిండి ఉండేది కాదు. ఎన్నోసార్లు ఆకలితోనే పడుకున్నాము. దొంగ చాటుగా ఫంక్షన్ హాళ్లకు వెళ్లి అక్కడ భోజనం చేసేవాళ్లమని కన్నీళ్లు పెట్టుకున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇలా ఫంక్షన్ హాల్ కు వెళ్లి దొంగ చాటుగా భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చి మీరు ఎవరి తాలూకా అని ఎక్కడ అడుగుతారోనని భయపడేవాడిని. అప్పుడు వీడే సమాధానం చెప్పేవాడు. ఇలా ఎన్నోసార్లు మాకు సత్యసాయి కళ్యాణ మండపం, సవేరా ఫంక్షన్ హాళ్లు ఉండేది అవే చాలా సార్లు మమ్మల్ని కాపాడాయి అంటూ శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ చెబుతూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ని ఎవరు మర్చిపోలేరు. మేము కూడా అలాంటి కష్టాలలోనూ పెరిగామని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంటూ ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అలాగే వారు పడిన కష్టాల గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.