BigTV English
Advertisement

OTT Movie : టైగర్‌కే చుక్కలు చూపించే అమ్మాయి… స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

OTT Movie : టైగర్‌కే చుక్కలు చూపించే అమ్మాయి… స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

OTT Movie : హాలీవుడ్ సినిమాలను థియేటర్లలో కంటే ఓటీటీలో ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో ఎక్కువగా యాక్షన్, హారర్ థ్రిల్లర్ సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా ఒక టైగర్ చుట్టూ తిరుగుతుంది. చివరివరకూ ఈ సినిమా ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

కెల్లీ టేలర్ అనే యువతి తన సోదరుడు టామ్ తో కలసి ఉంటోంది. ఆమె తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో సవతి తండ్రి జానీ వీళ్ళను చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు జానీ తన సఫారీ పార్క్ కోసం, ఒక బెంగాల్ టైగర్‌ను కొనుగోలు చేస్తాడు. దీని కోసం అతను కెల్లీ కాలేజీ ఫండ్స్‌ను ఖర్చు చేస్తాడు. ఈ టైగర్‌ ప్రమాదకరమైనదని దానిని పెంచిన సర్కస్ యజమాని జానీని హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఇది గతంలో ఒక గుర్రాన్ని క్రూరంగా చంపి ఉంటుంది. అయితే ఇక్కడే స్టోరీ ఒక మలుపు తిరుగుతుంది. ఒక వైపు హరికేన్ తుఫాన్ వస్తూ ఉంటుంది. మరోవైపు ఒక గుర్తుతెలియని వ్యక్తి కెల్లీ, టామ్ నిద్రపోతున్నప్పుడు టైగర్‌ను ఆ ఇంట్లో వదులుతాడు. వదిలే ముందు లోపలి నుంచి ఎవరూ బయటికి రాకుండా ఆన్నీ క్లోస్ చేస్తాడు. కెల్లీ ఉదయం లేవగానే ఇంట్లో టైగర్ సంచరిస్తున్నట్లు గమనిస్తుంది. బయటి వెళ్ళే అన్ని మార్గాలు మూసివేయడంతో కెల్లీ, టామ్ ఇంట్లోనే చిక్కుకుంటారు.


ఇక కెల్లీ తన సోదరుడిని రక్షించు కొంటూ, టైగర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కెల్లీ స్లీపింగ్ పిల్స్‌తో కూడిన మాంసాన్ని ఉపయోగించడం వంటి వివిధ వ్యూహాలను ఉపయోగిస్తుంది. కానీ టైగర్ వాళ్ళను వెంబడిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో జానీ దుర్మార్గపు ఆలోచనలు బయటపడతాయి. అతను ఇన్సూరెన్స్ డబ్బు కోసం కెల్లీ, టామ్‌ను టైగర్‌తో చంపించి, వీళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారు అని అందరూ అనుకునేలా ప్లాన్ చేస్తాడు. చివరికి కెల్లీ, టామ్‌ ఆ టైగర్ నుంచి తప్పించుకుంటారా ? ఆ టైగర్ వాళ్ళను ఏమైనా చేస్తుందా ? సవతి తండ్రిని పోలీసులు పట్టుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : దుపట్టాతో అమ్మాయిల్ని చంపే సైకో… వెన్నులో వణుకు పుట్టించే రియల్ స్టోరీ

యూట్యూబ్ (Youtube) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్నింగ్ బ్రైట్’ (Burning Bright).2010 లో వచ్చిన ఈ మూవీకి కార్లోస్ బ్రూక్స్ దర్శకత్వం వహించారు. ఇందులో బ్రియానా ఎవిగన్, గారెట్ డిల్లాహంట్, మీట్ లోఫ్, చార్లీ తహన్ వంటి నటులు నటించారు. హరికేన్ సమయంలో ఒక ఇంట్లో ఆకలితో ఉన్న పులి చిక్కుకుంటుంది. అందులో ఒక యువతి, ఆమె తమ్ముడు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ స్టోరీ నడుస్తుంది. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో ‘పులి పంజా’ (Puli Panja) పేరుతో కూడా అందుబాటులో ఉంది.

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×