E-Paper
Advertisement

Horror Movie ott : దెయ్యంతో సైంటిస్ట్ కు దబిడి దిబిడి… అమ్మాయి తోడుగా కావాలంటూ గోల… ఆస్కార్ రేసులో హర్రర్ మూవీ

Horror Movie ott : దెయ్యంతో సైంటిస్ట్ కు దబిడి దిబిడి… అమ్మాయి తోడుగా కావాలంటూ గోల… ఆస్కార్ రేసులో హర్రర్ మూవీ
Advertisement

Horror Movie ott : ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో హారర్ జానర్‌ నుంచి వచ్చిన మూవీ Frankenstein. ఆస్కార్ 2026లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ మేకప్ & హెయిర్‌స్టైలింగ్ సహా 9 నామినేషన్లు కొట్టేసింది. అంతేకాకుండా గోల్డెన్ గ్లోబ్‌లో బెస్ట్ హారర్ సై-ఫై మూవీ అవార్డ్ ని కూడా గెలిచింది. ఈ మూవీ డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టీన్ ఆనే ఒక సైంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతను చనిపోయిన మనుషుల పార్ట్స్ తో ఒక జీవిని సృష్టిస్తాడు. ఆ ప్రయోగం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇది ఓటీటీలో అత్యధిక వ్యూస్ కలిగిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. గుండెల్లో గుబులు పుట్టించే ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

గైలెర్మో డెల్ టోరో దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్రాంకెన్‌స్టైన్’ (Frankenstein) 2025లో అత్యంత ప్రజాదరణ పొందిన హారర్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో ఆస్కార్ ఐజాక్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైయిన్‌గా, జాకబ్ ఎలోర్డి క్రీచర్‌గా నటించారు. $150 మిలియన్ల బడ్జెట్ తో బాక్సాఫీస్ లో $420 మిలియన్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా 2025 ఆగస్టు 30న 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2025 నవంబర్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చిన్నతనంలో తన తల్లి మరణంతో విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తీవ్రంగా కలత చెందుతాడు. పెద్ద అయ్యాక మరణాన్ని జయించాలని, జీవం లేని శరీరాలకు తిరిగి ప్రాణం పోయాలని ఒక పిచ్చితో పరిశోధనలు మొదలుపెడతాడు. అందుకోసం యుద్ధంలో మరణించిన సైనికుల శరీర భాగాలను సేకరించి, మెరువు సహాయంతో ఒక భారీ మనిషిని సృష్టిస్తాడు. విక్టర్ అనుకున్నట్లే ఆ శరీరానికి ప్రాణం వస్తుంది, కానీ అది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది.

తను సృష్టించిన రూపాన్ని చూసి విక్టర్ భయపడి, దాన్ని మంటల్లో అక్కడే వదిలేసి పారిపోతాడు. తండ్రి లాంటి సృష్టికర్తే తనను తిరస్కరించడంతో ఆ ప్రాణి ఒంటరిదైపోతుంది. ఆ ప్రాణి ప్రాణాలతో బయటపడి అడవుల్లో తిరుగుతూ, మనుషులను చూసి భాషను, ఎమోషన్స్ ను నేర్చుకుంటుంది. తన సంతతిని పెంచుకోవడానికి దానికి ఒక అమ్మాయి తోడు కావలసి వస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఈ సినిమాని చూసి తెలుసుకొనాల్సిందే.

Advertisement

Read Also : పట్టుకొచ్చిన కొద్దీ పారిపోయే కూతురు… అండర్ వరల్డ్ ట్విస్ట్ తో సాగే సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×