E-Paper
Advertisement

Horror Movie ott : ప్రతి ఫ్రేమ్‌లో సస్పెన్స్, హారర్ సన్నివేశాలు ఉన్న 128 నిమిషాల చిత్రం… కల్లోనూ వెంటాడే కథ

Horror Movie ott : ప్రతి ఫ్రేమ్‌లో సస్పెన్స్, హారర్ సన్నివేశాలు ఉన్న 128 నిమిషాల చిత్రం… కల్లోనూ వెంటాడే కథ
Advertisement

Horror Movie ott : ఓటీటీలలో ఇప్పుడు హర్రర్ సినిమాల హవానే ఎక్కువగా నడుస్తోంది. అందుకే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఓటీటీ వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా అదే జానర్ లో సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేవారు పూర్తి స్థాయి ఉత్కంఠను అందించే సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. అందులో భయపెట్టే సినిమాలు కూడా ఒక భాగమే. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే 2 గంటల 8 నిమిషాల నిడివి గల హర్రర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందరినీ ఆకర్షిస్తోంది. మరి ట్రెండింగ్ జాబితాలో ఇప్పటికే బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సినిమాకి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా హర్రర్, సస్పెన్స్ సినిమా ప్రియులకు ఇది చాలా ఇష్టమైన సినిమాగా మారింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు బోర్ అనిపించకపోవడమే కాదు భయపడతారు కూడా. ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే OTT ప్లాట్‌ఫామ్‌లలో రెండు భాగాలు విడుదలైంది. మూడవ భాగం 2026 ఫిబ్రవరి 4న ప్రీమియర్ అయింది. ఇప్పటికీ ఈ మూవీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక సస్పెన్స్ కు తెర దించితే, ఈ మూవీ పేరు “డెత్ విస్పర్ 3”. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అనూహ్యంగా మంచి ప్రదర్శన ఇస్తోంది. కాబట్టి ఈ సినిమాను మిస్ అవ్వకుండా ఓటీటీలో ఒక లుక్కేయండి.

Advertisement

Also Read : ఓటీటీలో ఉన్న బెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు… గర్ల్ ఫ్రెండ్ తో డోంట్ వాచ్

కథలోకి వెళ్తే…

ఇండోనేషియా హారర్ సస్పెన్స్ సినిమా సిరీస్ మూడవ భాగం ‘డెత్ విస్పర్ 3’. మొదటి రెండు భాగాలు భారీ విజయం సాధించాయి. మూడవ భాగం ఇటీవలే వచ్చింది. తన చెల్లెలిని రక్షించడానికి భయంకరమైన ప్రయాణాన్ని ప్రారంభించే యాక్ (అభినవ్ సింగ్) చుట్టూ కథ తిరుగుతుంది. ఆమెను రక్షించడానికి అతను అనేక శక్తివంతమైన ఆత్మలతో పోరాడాలసి ఉంటుంది. కథ మొదటి భాగాలతో లింకు అయ్యి ఉంటుంది. యాక్ గతంలో ఎదుర్కొన్న దెయ్యాలు మళ్లీ రావడం, అతని చెల్లెలు వాటికి బలవడం వంటివి జరుగుతాయి. మధ్యలో హారర్ సీన్స్, సస్పెన్స్ ట్విస్ట్‌లు, భావోద్వేగ మలుపులు ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా బోర్ అన్పించదు. పైగా ప్రతి సీన్ ఉత్కంఠతో నిండి ఉంటుంది. ఇండోనేషియాలోని జానపద కథల ఆధారంగా తీసిన ఈ సినిమా నిజమైన హర్రర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. డైరెక్టర్ అవా రోకా సినిమాను భయంకర సన్నివేశాలతో, డార్క్ విజువల్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనికి ముందు వచ్చిన రెండు భాగాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండడం బెటర్.

Advertisement

 

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×