E-Paper
Advertisement

Best Romantic Web Series : ఓటీటీలో ఉన్న బెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు… గర్ల్ ఫ్రెండ్ తో డోంట్ వాచ్

Best Romantic Web Series : ఓటీటీలో ఉన్న బెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు… గర్ల్ ఫ్రెండ్ తో డోంట్ వాచ్

Best Romantic Web Series : వాలెంటైన్స్ డే సమయంలో ప్రేమికులు రొమాంటిక్ మూవీలు లేదా సిరీస్‌లు చూస్తూ సమయం గడపడం అన్నది సర్వసాధారణం. ఇప్పుడు చాలామంది సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనే ఎక్కువగా చూస్తున్నారు. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఓటీటీ వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. అయితే వీటిలో రొమాంటిక్ జానర్ సమ్‌థింగ్ స్పెషల్. ఈ కథల్లో లవ్, రొమాన్స్‌ను సరికొత్తగా, కళాత్మకంగా చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తారు. మరి ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున చూడాల్సిన సిరీస్ లు ఏంటి? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

1. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ (Broken But Beautiful)

ఈ రొమాంటిక్ సిరీస్ 2018లో ZEE5లో అందుబాటులో ఉంది. నాలుగు సీజన్‌లు ఉండగా, ప్రతి సీజన్ 10-12 ఎపిసోడ్‌లు ఉంటుంది. ఈ సిరీస్ వీర్, సమీర అనే ఇద్దరు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ అప్పటికే హార్ట్ బ్రేక్ అయ్యి, మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. విక్రాంత్ మాస్సే వీర్ అనే లీడ్ రోల్ చేశారు. వీర్ ఒక ఆర్టిస్ట్. అతడి భార్య చనిపోతుంది. ఆమె జ్ఞాపకాలు వీర్‌ను వెంటాడుతూ ఉంటాయి. బ్రేకప్ అయ్యి, మూవ్ ఆన్ అయ్యే ‘సమీర’ పాత్రలో హర్లీన్ సేథి నటించింది. ఒక రకమైన ట్రాజడీ అనుభవిస్తున్న వీర్, సమీర కలుసుకుంటారు. ఆ తర్వాత వీరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. వాలెంటైన్స్ డేకి బ్రోకెన్ హార్ట్‌ పీపుల్లు మళ్లీ ప్రేమలో పడటం గుర్తుచేసే సిరీస్ ఇది.

2. పర్మినెంట్ రూమ్‌మేట్స్ (Permanent Roommates)

2014లో విడుదలైన భారతీయ వెబ్ సిరీస్ ‘పర్మినెంట్ రూమ్‌మేట్స్’. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ మూడు సీజన్‌లతో ముగిసింది. ప్రతి సీజన్ లో 5-8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. మూడేళ్లుగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తాన్య (నిధి సింగ్), మికేష్ (సుమీత్ వ్యాస్) అనే యంగ్ కపుల్ లైఫ్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. తాన్యకు ప్రపోజ్ చేసి, వారి రిలేషన్‌షిప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మికేష్ యూఎస్ నుంచి ఇండియా తిరిగి వస్తాడు. కానీ ప్రపోజ్ చేశాక ఇద్దరూ కలిసి ఉండలేక సమస్యలు ఎదుర్కొంటారు. తర్వాత వీరి రిలేషన్‌షిప్‌ జర్నీలో జరిగే పరిణామాలను ఈ సిరీస్‌లో చూపించారు. సిరీస్ లో ప్రేమ, వివాహం, కుటుంబ ఒత్తిడి, చిన్న చిన్న గొడవలు అన్నీ సహజంగా చూపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. వాలెంటైన్స్ డేకి ప్రేమికుల మధ్య రిలేషన్‌షిప్ డైనమిక్స్ అర్థం చేసుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్.

3. లిటిల్ థింగ్స్ (Little Things)

2016లో మొదలైన రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘లిటిల్ థింగ్స్’. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ నాలుగు సీజన్‌లు ఉన్నాయి, ప్రతి సీజన్ 6-8 ఎపిసోడ్‌లు ఉంటుంది. ధృవ్ సెహగల్ తీసిన ఈ సిరీస్‌ ధృవ్, కావ్య అనే యంగ్ కపుల్ మధ్య రిలేషన్‌షిప్, వారి జీవితం చుట్టూ తిరుగుతుంది. వీరు ముంబైలో అర్బన్ లైఫ్ గడపాలనుకుంటారు. ఇందులో ఒక రిలేషన్‌షిప్‌లో ఉండాల్సిన తోడు, ప్రేమ వంటి ఫీలింగ్స్‌ను చాలా బ్యూటీఫుల్‌గా చూపించారు. మిథిలా పాల్కర్, ధృవ్ సెహగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్ చిన్న విషయాలలో ప్రేమను కనుగొనడం, కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేయడం వంటి అంశాలను హైలైట్ చేస్తుంది. వాలెంటైన్స్ డేకి ప్రేమికుల మధ్య చిన్న సరదాలు, గొడవలు గుర్తుచేసే సిరీస్ ఇది.

Read Also : 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్‌… వారం రోజులు అలాంటి డీల్… క్రేజీ రొమాంటిక్ కామెడీ

4. మిస్‌మ్యాచ్డ్ (Mismatched)

2020లో మొదలైన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘మిస్ మ్యాచ్డ్’, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంధ్యా మీనన్ రాసిన ‘వెన్ డింపుల్ మెట్ రిషి’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ రెండు సీజన్‌లు ఉంది. మొదటి సీజన్ 6 ఎపిసోడ్‌లు, రెండో సీజన్ 8 ఎపిసోడ్‌లు ఉంటుంది. సమ్మర్ కోడింగ్ ప్రోగ్రామ్‌ కోసం రిజిస్టర్ చేసుకున్న డింపుల్, రిషి అనే ఇద్దరు వ్యక్తుల కథను సిరీస్‌ లో చూపించారు. డింపుల్ (ప్రజక్తా కోలి) యాప్ డెవలపర్ కావాలని కలలు కంటూ కెరీర్‌పై దృష్టి పెడుతుంది. అయితే సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన రిషి (రోహిత్ సరాఫ్) ప్రేమ కోసం తపిస్తాడు. వీరి విభిన్న వ్యక్తిత్వాలు, లక్ష్యాల కారణంగా ఇద్దరి మధ్య అపార్థాలు వస్తాయి. ఈ జర్నీలో ఇద్దరి మధ్య ఊహించని కనెక్షన్ పెరిగి, ఒకరిపై మరొకరు ఫీలింగ్స్ పెంచుకుంటారు. మోడ్రన్ ఇండియన్ సొసైటీలో లవ్, ఫ్రెండ్‌షిప్, రొమాన్స్, సెల్ఫ్ డిస్కవరీ వంటి థీమ్స్‌ను ఈ సిరీస్‌లో చూపించారు.

5. బండిష్ బండిట్స్ (Bandish Bandits)

2020లో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ సిరీస్ ‘బండిష్ బండిట్స్’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని చూడవచ్చు. రెండు సీజన్‌లు ఉండగా, మొదటి సీజన్ 10 ఎపిసోడ్‌లు నడుస్తుంది. అమృత పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ తీసిన ఈ సిరీస్‌ స్టోరీ… జోధ్‌పూర్‌లోని సంప్రదాయ సంగీత కుటుంబానికి చెందిన క్లాసికల్ సింగర్ రాధే రాథోడ్ (రిత్విక్ భౌమిక్), ముంబైకి చెందిన పాప్ సింగర్ తమన్నా శర్మ (శ్రేయా చౌధరి) చుట్టూ తిరుగుతుంది. రెండు వేర్వేరు మ్యూజిక్ వరల్డ్స్ నుంచి వచ్చిన ఈ ఇద్దరి జర్నీ ఎలాంటి మలుపు తిరిగిందో ఈ సిరీస్‌లో చూపించారు.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×